అక్షయ్‌కుమార్ సినిమా పేరు విని మోదీ నవ్వేశారు
- May 09, 2017
బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ప్రస్తుతం అక్షయ్ ‘టాయ్‌లెట్-ఏక్ ప్రేమ్‌కథా’ సినిమాలో నటిస్తున్నారు. మోదీ ప్రారంభించిన ‘స్వచ్ఛ భారత్’ క్యాంపెయిన్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా అక్షయ్.. మోదీని కలిసి సినిమా గురించి వివరించారు. అయితే అక్షయ్ తన సినిమా టైటిల్ గురించి చెప్పగానే మోదీ నవ్వు ఆపుకోలేకపోయారట. ఈ విషయాన్ని అక్షయ్ ఫేస్బుక్ ద్వారా వెల్లడిస్తూ.. ఆయన నవ్విన క్షణాన్ని మాత్రం మర్చిపోలేనని చెప్పారు.
ఇందులో అక్షయ్‌కి జోడీగా భూమి పెడ్నేకర్ నటిస్తోంది. శ్రీనారాయణ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూన్ 2న విడుదల కానుంది.
తాజా వార్తలు
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్‌లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్‌లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్









