తెలంగాణా లో ఫిలిం ఇన్ట్సిట్యూట్ ఏర్పాట్లు
- October 05, 2015
తెలంగాణా రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిల్మ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు సుభాష్ ఘాయ్ సోమవారంనాడు ప్రకటించారు.ప్రముఖ బాలీవుడ్ సిని నిర్మాత దర్శకుడు సుభాష్ ఘాయ్ పంచాయితీరాజ్ మరియు ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావుని సచివాలయంలో కలిసారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త రాష్ట్రంలో సిని పరిశ్రమ అభివృద్దికి చేపట్టిన కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణా రాష్ట్రంతో పనిచేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని మంత్రికి తెలియజేశారు. తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఓక పిల్మ్ ఇన్ట్సిట్యూట్ ని ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.. ఈ మేరకి తమ వద్ద ఉన్న ప్రణాళికను వివరించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సినిమా, వినోద రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వం తలపెట్టిన గేమింగ్ సిటీలో భాగస్వాములు కావాలని సుభాష్ ఘాయ్‌ని కోరారు. తమ ప్రభుత్వం రాచకొండ వద్ద అంతర్జాతీయ స్ధాయిలో అత్యున్నత ప్రమాణాలతో చేపట్టనున్న పిల్మ్ సిటీ గురించి వివరించిన మంత్రి...అక్కడ సుభాష్ ఘాయ్ సంస్ధ విజిలింగ్ వూడ్స్ సంస్ధ ఏర్పాటుని పరిశీలించాలని కోరారు. ఈ ప్రతిపాదన పట్ల హర్షం వ్యక్తం చేసిన సుభాష్ ఘాయ్ సానుకూలంగా స్పందించారు. సినీ రంగంలో స్థానిక యువకులకు అవకాశాలు దక్కేలా, వారిలో ఉన్న ప్రతిభను వెలుగులోకి తీసుకుని వచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని సుభాష్ ఘాయ్‌కి మంత్రి కెటిఆర్ సూచించారు. ప్రభుత్వం తలపెట్టిన గేమింగ్ సిటీలో భాగస్వాములు కావాలని సుభాష్ ఘాయ్‌ని కోరారు. రాచకొండ వద్ద అంతర్జాతీయస్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో చేపట్టనున్న ఫిల్మ్ సిటీ గురించి వివరించిన కెటిఆర్.... అక్కడ సుభాష్ ఘాయ్ సంస్థ విజిలింగ్ ఉడ్స్ ఏర్పాటును పరిశీలించాలని కోరారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







