డైరెక్టర్ పూరితో రేవతి

- October 05, 2015 , by Maagulf
డైరెక్టర్ పూరితో రేవతి

టాలీవుడ్ లో మరో ఇంట్రస్టింగ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుంది. ఒకప్పటి హీరోయిన్ రేవతి త్వరలో ఓ తెలుగు సినిమాకు దర్శకత్వం వహించనుంది. పలు సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించిన రేవతి తెలుగులో కమర్షియల్ సినిమా చేయనుందట. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన కథా చర్చలు కూడా ప్రారంభమయ్యాయన్న టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కథా స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ప్రస్తుతం రేవతి పూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లోఫర్' (వర్కింగ్ టైటిల్) సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా సమయంలోనే తన స్టోరి ఐడియా వినిపించిన పూరి రేవతిని ఆ సినిమాను డైరెక్ట్ చేయాల్సిందిగా కోరాడట, అందుకు రేవతి కూడా అంగీకరించటంతో త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కా ఛాన్స్ కనిపిస్తుందంటున్నారు. పూరి స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు హీరోయిన్ చార్మీ సహనిర్మాతగా వ్యవహరించనుంది. గతంలో 'జ్యోతిలక్ష్మీ' సినిమాతో నిర్మాతగా మారిన ఈ బ్యూటి, మరోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకోనుంది. 'ఉయ్యాల జంపాల', 'సినిమా చూపిస్త మామ' లాంటి వరుస హిట్స్ తో మంచి ఫాంలో కనిపిస్తున్న రాజ్ తరుణ్ ఈ సినిమాలో హీరోగా నటించనున్నాడు. తెలుగు లోనటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రేవతి దర్శకురాలిగా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com