ఏ క్షణమైనా అగ్రరాజ్యం అమెరికాపై అణుదాడికి సిద్ధమే ఉత్తర కొరియా

- May 11, 2017 , by Maagulf
ఏ క్షణమైనా అగ్రరాజ్యం అమెరికాపై అణుదాడికి సిద్ధమే ఉత్తర కొరియా

అగ్రరాజ్యం అమెరికాతో కయ్యానికి కాలుదువ్వుతోంది ఉత్తరకొరియా. అమెరికాపై హెచ్చరికలు చేస్తూ మరోసారి దుస్సాహసానికిపాల్పడింది. అణుబాంబుతో దాడిచేస్తే అమెరికాలో కోట్ల మంది ప్రజలు మరణిస్తారని తాజాగా హెచ్చరికలు చేసింది.
ఉత్తరకొరియా అధికార ప్రతినిధి రోడాంగ్‌ సిన్మన్‌ ఓ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికాపై ఏ క్షణంలోనైనా అణుదాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ మేరకు ఉ.కొరియా నుంచి ప్రకటన ఇటీవల జరిపిన డ్రిల్‌ యుద్ధానికి ప్రారంభం లాంటిది. అమెరికా పూర్తిగా నాశనం అవుతుంది. యుద్ధం జరిగితే.. కోట్ల మంది అమెరికన్లు అణుదాడిలో మరణిస్తారు. ఆ దేశ స్వరూపమే మారిపోతుంది. అమెరికాలో ప్రాణాలతో మిగిలిన వారికి కనీసం షెల్టర్‌ కూడా దొరకదు. ఇకనైనా అమెరికా.. దక్షిణకొరియాలో ఉన్న వారి భద్రత గురించి ఆలోచించడం మాని, తమ దేశంలోని ప్రజలను ఎలా కాపాడుకోవాలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అని ప్రకటనలో పేర్కొంది. 
ఇక ఉ.కొరియాకు చెందిన మరో మీడియాలో.. యుద్ధవినాశనం నుంచి తప్పించుకోవాలంటే అమెరికాకు ఒకే ఒక్క దారి ఉంది. దక్షిణకొరియా నుంచి వారి మిలిటరీని, ప్రజలను స్వదేశానికి తీసుకెళ్లాలి అని పేర్కొంది.ఉ.కొరియా చర్యలను అడ్డుకునేందుకు అమెరికా దక్షిణకొరియాలో తమ మిలిటరీ బలగాలను సిద్ధం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుచరులు కొరియా సరిహద్దులో పాగా వేశారు. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉ.కొరియా ఈ విధంగా హెచ్చరికలకు దిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com