మహేష్ 'స్పైడర్' వచ్చేది.. సెప్టెంబర్ లో
- May 11, 2017
మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మహేష్ 'స్పైడర్' షూటింగ్ చివరి దశకు చేరుకొంది. ప్రస్తుతం క్లైమాక్స్ ఏపీసోడ్ ని చిత్రీకరిస్తున్నారు. రంజాన్ కానుకగా జూన్ 23న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన 'స్పైడర్'ని ఆగస్టుకి వాయిదా వేశారు. ఆగస్టు 11న 'స్పైడర్' ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించింది. అయితే, ఇప్పుడీ డేట్ కి కూడా 'స్పైడర్' రిలీజ్ కావడం లేదట
తాజా సమాచారమ్ ప్రకారం స్పైడర్ ని ఆగస్టులో కాకుండా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలుస్తోంది. దర్శకుడు మురగదాస్ 'స్పైడర్' విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావడం లేదట.
ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టనుంది. దాదాపు రూ. 100కోట్ల బడ్జెట్ తో స్పైడర్ తెరకెక్కుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ని తెలుగు, తమిళ్ లో రిలీజ్ చేయనున్నారు. హిందీలో డబ్ చేసి వదలనున్నారు. ఈ చిత్రానికి సంగీతం హరీష్ జయరాజ్. ఎన్.వి ప్రసాద్, ఠాగూర్ మధు నిర్మాతలు.
తాజా వార్తలు
- కొత్తగా ప్రపోజ్ చేస్తానని పిలిచి.. బెంగుళూరులో ఘోరం
- టాలీవుడ్లో విషాదం..చిట్టిబాబు కన్నుమూత
- వైభవంగా కేదార్నాథ్ ఆలయ పునఃప్రారంభం..
- సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ
- పహల్గామ్ బాధితులకు ప్రధాని మోదీ నివాళి
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్‌కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!









