మీలో ఎవరు కోటీశ్వరుడినుంచి తప్పుకుంటున్నమెగాస్టార్ చిరంజీవి
- May 12, 2017
మా టీవీలో ఒకప్పుడు అద్భుతంగా రన్నయిన టీవీ షో కార్యక్రమం ఇది. నాగార్జున హోస్ట్‌గా ప్రారంభించి మూడు సీజన్లను సక్సెస్ చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు, ఇప్పుడు చిరంజీవితో రన్ చేస్తున్నారు. అయితే నాగార్జున హోస్ట్‌గా ఉన్నప్పుడే విమర్శలనెదుర్కున్న ఈ షో టీ ఆర్పీ రేటింగ్స్‌ని ఆశించిన స్థాయిలో పెరగలేదు. చిరంజీవి హోస్ట్‌గా మొదలు పెట్టాక మొదట్లో అద్భుతంగా రన్నయింది. తాజాగా చిరంజీవి హోస్ట్‌గా షో మొదలయ్యాక వాట్సాప్‌లో ఈ షో మీద నెగెటివ్ ప్రచారం మరింత ఎక్కువైంది. సెలబ్రిటీలను పిలిపించి జనాల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసినా క్లిక్ అవ్వకపోయేసరికి చిరంజీవికి, నిర్వాహకులకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. చిరంజీవి బుల్లితెర ఎంట్రీ సక్సెస్ అవుతుందని అనుకుంటే, ఆరంభం నుంచే ఇది డిజాస్టర్ దిశగా సాగింది. ఆల్రెడీ బోర్ కొట్టేసిన కాన్సెప్ట్‌ని తీసుకుని చిరంజీవి టెలివిజన్ రంగంలోకి రావడం పెద్ద మిస్టేక్ అయింది. ఎన్ని విధాలుగా టీఆర్పీలు పెంచడానికి చూసినా కానీ మీలో ఎవరు కోటీశ్వరుడు ఏ దశలోను పుంజుకోలేకపోయింది. అయితే మొదటి సీజన్ పూర్తి చేయడం బాధ్యతగా తీసుకుని చిరంజీవి దానిని కొనసాగించారు. ఈ నెలతో మొదటి సీజన్ పూర్తవుతుంది. నిజానికి సెప్టెంబర్‌లో మళ్లీ సీజన్ స్టార్ట్ చేయాల్సి వుంది కానీ అది ఇక జరగదని అంటున్నారు.
తాజా వార్తలు
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్‌లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









