ఒడిశాలోని అదుపుతప్పి లోయలో పడిపోయిన డబుల్ డెక్కర్ బస్సు

- May 12, 2017 , by Maagulf
ఒడిశాలోని అదుపుతప్పి లోయలో పడిపోయిన డబుల్ డెక్కర్ బస్సు

విశాఖపట్టణం నుంచి ఒడిశాలోని బ్రహ్మపురంకు 40మంది ప్రయాణికులతో వెళ్తున్న డబుల్‌డెక్కర్‌ ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్త్ పడింది.  ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి వద్ద నేషనల్ హైవే పై వెళ్తుండగా అదుపు తప్పి...సుమారు 15 అడుగుల లోతున్న లోయలోకి జారిపోయింది. అదృష్టవశాత్తు చెట్లు అడ్డుపడటంతో బస్సులో ప్రయణిస్తున్న పాసెంజర్స్ అందరు సేఫ్ గా బయటపడ్డారు. ఈ సంఘటనలో డ్రైవర్‌తో పాటు 11 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని ఇచ్ఛాపురం గవర్నమెంట్ హాస్పటలకి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. స్పాట్ కి చేరుకున్న ఎస్సై చెన్నమనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com