'అజిత్ ' వివేగం రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాడు
- May 12, 2017
తమిళం లో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ అజిత్. ఈయన నుండి సినిమా వస్తుందంటే అభిమానులకు పెద్ద పండగే..ఫస్ట్ లుక్ నుండి మొదలు పెడితే సినిమా రిలీజ్ వరకు కూడా వీరు చేసే హంగామా మాములుగా ఉండదు. సినిమా కు సంబదించిన ఏది బయటకు వచ్చిన సరే దానిని రికార్డ్స్ మోత మోగిస్తారు.
తాజాగా అజిత్ నటిస్తున్న 'వివేగం' టీజర్ విషయం లోను అలాగే జరుగుతుంది. బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు యూట్యూబ్‌లో విడుదలైన ఈ టీజర్ , ప్రస్తుతం యు ట్యూబ్ లో రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది.. కేవలం 12 గంటల్లోనే 50 లక్షల మంది 'వివేగం' టీజర్‌ను వీక్షించారు . తద్వారా దక్షిణాది సినిమాలో అతి తక్కువ సమయంలో ఎక్కువ వ్యూస్ సాధించిన టీజర్‌గా 'వివేగం' సరికొత్త రికార్డు సృష్టించింది. రజనీకాంత్ 'కబాలి' ఈ ఫీట్‌ను 24 గంటల్లో అందుకోగా ఇలయ దళపతి విజయ్ 'భైరవ' టీజర్‌కు 76 గంటలు పట్టింది. అయితే ఈ జాబితాలో మూడో స్థానం టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌దే. ఆయన నటించిన 'కాటమరాయుడు' 57 గంటల్లో 5 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది.
సత్యజ్యోతి ఫిలింస్ బ్యానర్‌పై శివ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. అజిత్ కు జంటగా కాజల్ అగర్వాల్, అక్షర హాసన్ జంటగా జంటగా నటించారు.
తాజా వార్తలు
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్‌లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









