మాతంగి’గా బాహుబలి శివగామి రమ్యకృష్ణ
- May 13, 2017
మాగ్నమ్ ఓపస్ మూవీ ‘బాహుబలి’లో రాజమాత శివగామిగా అత్యద్భుత నటన కనబరిచిన రమ్యకృష్ణ ఇప్పుడు ‘మాతంగి’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళ దర్శకుడు కన్నన్ తమరక్కులమ్ రూపొందించిన ‘మాతంగి’ చిత్రంలో జయరామ్, సంపత్, అక్షర కిశోర్, ఏంజెలీనా అబ్రహమ్ తో పాటు దేశం గర్వించే నటుడు, స్వర్గీయ ఓంపురి కీలక పాత్ర పోషించారు.
మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ మలయాళంలో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యమైన విషయం ఏమంటే... వెయ్యి ఎసిసోడ్స్ తో రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారిగా ‘వంశం’ సీరియల్ ను నిర్మించిన రమ్యకృష్ణ సోదరి శ్రీమతి వినయ్ కృష్ణన్ ‘మాతంగి’ చిత్రాన్ని డబ్ చేయబోతున్నారు. రమ్యకృష్ణకు లక్షలాది అభిమానులు ఉన్న తెలుగులో ఈ సినిమా జూన్ మాసంలో రాబోతోంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కొన్ని మార్పులూ చేయడం జరిగింది. రమ్యకృష్ణతో పాటు ఇందులో ఇద్దరు చిన్నారులు చక్కని నటనను కనబరచడం విశేషం. రితేష్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్ కానుంది. రెగ్యులర్ హారర్ చిత్రాలకు భిన్నంగా తెరకెక్కిన రమ్యకృష్ణ ‘మాతంగి’ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ‘మాతంగి’ ట్రైలర్ శనివారం సోషల్ మీడియా ద్వారా జనం ముందుకు వచ్చింది.
తాజా వార్తలు
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









