పాకిస్తాన్ లో కూలీలపై కాల్పులు....
- May 13, 2017
కరాచీ: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ రాష్ట్రంలో శుక్రవారం బాంబు పేలుడు జరిగి 25మంది ప్రాణాలు కోల్పోగా.. తాజాగా అదే ప్రాంతంలో మరో ఘటన చోటుచేసుకుంది. గ్వాడార్ పోర్టు సమీపంలో రోడ్డు పనులు చేస్తున్న కూలీలపై కాల్పులకు తెగబడ్డారు దుండగులు. వీరిలో 10 మంది కూలీలు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సింధ్ ప్రాంతానికి చెందిన కొందరు కూలీలు గ్వాడార్ పోర్టు సమీపంలో రోడ్డు ప్రాజెక్టు పనులు చేస్తుండగా.. ఆయుధాలతో వచ్చిన దుండగులు దాడి చేశారు. వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎనిమిది మంది కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే ఈ ప్రాంతంలో వేర్పాటువాదులు తరచుగా దాడులు చేస్తుంటారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్‌లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









