ఆంధ్రప్రదేశ్ లో కార్మికుల భద్రతకు కొత్త చట్టం
- May 15, 2017
కార్మికుల భద్రత, కాలుష్య రహిత పరిశ్రమల కోసం కొత్త చట్టాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం ఏర్పాటైన మంత్రి వర్గ ఉప సంఘం వెలగపూడి సచివాలయంలో సోమవారం సమావేశమైంది. పరిశ్రమలు, కార్మికుల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఆయా శాఖల అధికారులతో కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, అటవీ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు, పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథరెడ్డి ప్రాథమిక చర్చలు జరిపారు. పూర్తిస్థాయి కార్యాచరణ కోసం మరో దఫా చర్చలు జరపనున్నట్లు మంత్రులు విలేకరులకు చెప్పారు. రెడ్ కేటగిరీలో ఉన్న పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవడం, కాలుష్య నివారణ అంశాలపై యాజమాన్యాలను చైతన్యపరచాలని నిర్ణయించినట్లు తెలిపారు. మొగల్తూరు తదితర ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాలు ప్రభుత్వాన్ని కదిలించాయని, ఇకపై ప్రమాదాలు, కాలుష్యం లేకుండా పరిశ్రమలు నడిచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పితాని తెలిపారు. రాష్ట్రానికి అనేక పరిశ్రమలు రావాలని, అయితే అవి కాలుష్యరహితంగా ఉండాలని ఇదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
తాజా వార్తలు
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్‌కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!









