మెగాస్టార్ చిరు చిత్రంతో రాములమ్మ రీ ఎంట్రీ
- May 16, 2017
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 151వ చిత్రం 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కాబట్టి ఎక్కడా కూడా లోపం జరగకుండా పక్కా సమాచారంతో తెరకెక్కించాలని చిత్ర యూనిట్ వారు నానా అవస్థలు పడుతున్నారు. ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కించనుండగా రామ్ చరణ్ నిర్మించనున్నాడు. 'ఉయ్యాaవాడ' స్వాతంత్ర సమర యోధుడు కాబట్టి ఈ చిత్రంపై పaువురు డిమాండ్లు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం అసభ్యకరంగా తెరకెక్కిస్తే ఊరుకునేది లేదు అంటూ గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. అందుకే యూనిట్ సభ్యులు ఈ చిత్రం కోసం పక్కా ప్లాన్‌ను తయారు చేస్తున్నారు.
స్క్రిప్టు పరంగా ఓ వైపు చాలా సీరియస్‌గా చర్చలు జరుగుతండగా నటీనటుల విషయం కూడా హాట్ టాఫిక్‌గా మారింది. ఈ చిత్రంలో చిరు సరసన హీరోయిన్ ఎవరు అనేది ఇంకా అధికారికంగా ఫిక్స్ కాలేదు. అయితే 'ఉయ్యాలవాడ'కు ముగ్గురు భార్యలు ఉండేవారు అని వార్తలు ప్రచారం అయ్యాయి. మరి ఈ చిత్రంలో ముగ్గురిని చూపిస్తారా లేదా బడ్జెట్ ఎక్కువ అవుతుందని తగ్గిస్తారా అనేది ఇంకా తెలియదు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంతో రాములమ్మ విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుంది అని ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తోంది. గతంలో చిరు, విజయశాంతిలు కలిసి ఎన్నో చిత్రాలలో జతగా నటించగా ఈ చిత్రం ద్వారనే విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు అని తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో అనేది చిత్ర యూనిట్ అధికారిక ప్రకటించే వరకు ఎదురుచూడాల్సిందే.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







