షార్జాలో కారు దొంగల అరెస్ట్
- October 06, 2015
ముగ్గురు బంగ్లాదేశీయులను షార్జా పోలీసులు అరెస్ట్ చేశారు. పార్కింగ్ చేసి ఉన్న కార్లలో విలువైన వస్తువుల్ని ఈ గ్యాంగ్ దొంగిలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కార్లలో దొంగతనాలపై పలు ఫిర్యాదులు రావడంతో షార్జా పోలీసులు, ఈ దొంగల గ్యాంగ్‌ని పట్టుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దొంగల నుంచి విలువైన వస్తువుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కార్లను పార్కింగ్ చేసేటప్పుడు భద్రత కలిగిన ప్రాంతాన్ని చూసుకోవాలని వాహనదారులకు పోలీసులు సూచించారు. ప్రజలు పోలీసుల సూచనల్ని పాటిస్తే దొంగతనాల్ని అరికట్టవచ్చని పోలీసు అధికారి ఒకరు వివరించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!







