మస్కట్లో నివాసం ఎంతో ఆనందం
- October 06, 2015
ఐదు ప్రముఖ నగరాల్లో మస్కట్ 'అత్యంత ఆనందకరమైన నివాసం గలిగిన నగరం'గా ఖ్యాతి గడించింది. బిఎవైటి డాట్ కామ్ అనే కెరీర్ వెబ్సైట్, వైఓయుజిఓవి అనే ఆన్లైన్ మార్కెట్ కంపెనీ నిర్వహించిన సర్వేలో 80 శాతం మంది మస్కట్ వాసులు, మస్కట్లో తాము చాలా హ్యాపీగా జీవిస్తున్నట్లు వెల్లడించారు. 'టాప్ సిటీస్ ఇన్ ది మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా' (మేనా) సర్వే 2015 పేరుతో ఈ సర్వే జరిగింది. రభా అల్ సులేమనీ చెబుతూ, మస్కట్ ఓ గొప్ప నగరమనీ, శాంతిభద్రతలు కలిగిన నగరమనీ అన్నారు. భారతదేశం నుంచి వచ్చి మస్కట్లో స్థిరపడ్డ ప్రకాష్ మాట్లాడుతూ, పదేళ్ళ నుంచీ మస్కట్లో ఉంటున్నాననీ, అవకాశం ఉంటే జీవితాంతం ఇక్కడే స్థిరపడిపోతాననీ అన్నారు. ఒమన్ స్థానికుడు అనీష్, మస్కట్ని క్లీన్ సిటీగా అభివర్ణించాడు. ప్రతి పది మందిలో ముగ్గురు, మస్కట్లో ఉద్యోగాల లభ్యత బాగుంది, చాలా బాగుంది అని చెప్పారు.
--నూనె లెనిన్ కుమార్ (ఒమాన్)
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







