జూన్ 2న తెలంగాణ సర్కార్ కెసిఆర్ 2 కొత్త పథకాలు
- May 17, 2017
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. జూన్ 2న కొత్త పథకాలకు శ్రీకారం చుట్టబోతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒంటరి మహిళలకు ఆర్ధిక భృతి, కేసీఆర్ కిట్ల పంపిణీతో పాటు ప్రభుత్వం అదే నెలలో గొర్రె పిల్లల పంపిణీ కూడా చేపట్టనుంది. దీనికోసం ఇప్పటికే కసరత్తులు కూడా పూర్తి చేసింది. కిట్ల పంపిణీ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే సీఎస్ స్ధాయిలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష కూడా జరిగింది. లక్షా 80 వేల మంది గర్భిణులు ఈ పథకంలో రిజిష్టర్ చేసుకున్నారు. ఈ సంఖ్య 20 నుంచి 30 శాతం పెరిగే అవకాశం ఉండచ్చని అధికారుల అంచనా.జిల్లాల్లోని అన్ని ఆస్పత్రుల్లో దీనికి సంబంధించి ఏర్పాట్లు చేశారు. అవసరమైన మేరకు డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బందిని కూడా నియమించాలని సర్కార్ సూచించింది. కేసీఆర్ కిట్స్ పథకం కోసం స్పెషల్ సాఫ్ట్ వేర్ కూడా రూపొందించారు. ఈ పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేసుకున్న వారికి రెండు వేలు రూపాయల విలువైన కేసీఆర్ కిట్ అందిస్తారు. దీంతోపాటూ మగ శిశువుకు 12 వేలు, ఆడ శిశువుకు 13 వేలు 4 విడతలుగా చెల్లిస్తారు. బ్యాంక్ అకౌంట్ ఉంటే నేరుగా వారి ఖాతాల్లో నగదు జమ చేస్తారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 న హైదరాబాద్ లో సీఎం, జిల్లాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఈ కిట్లు పంపిణీ చేస్తారు. ఒంటరి మహిళలకు ఆర్ధిక భృతి పథకానికి కూడా ఈ నెల 8 నుంచి 13 వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తైంది. వీటిని వెంటనే పరిశీలించి.. లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఈ పథకం పై ఇప్పటికే విస్తృత ప్రచారం కల్పించారు. బ్యాంకు ఖాతాలు లేని వారికి ఖాతాలు తెరిచేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒంటరి మహిళలకు కూడా జూన్ 2 నుంచే ప్రభుత్వం పెన్షన్లు అందించనుంది. కొత్త పథకాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని ప్రభుత్వం భావిస్తోంది. పూర్తి పారదర్శకంగా పథకాల అమలయ్యేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







