పైరసీ యత్నాన్ని తిప్పికొట్టిన ఇండియన్‌ నేవీ

- May 18, 2017 , by Maagulf
పైరసీ యత్నాన్ని తిప్పికొట్టిన ఇండియన్‌ నేవీ

గల్ఫ్‌ ఆఫ్‌ అదెన్‌లో పైరసీ యత్నాన్ని ఇండియన్‌ నేవీ పెట్రోల్‌ షిప్‌ ఐఎన్‌ఎస్‌ శారద తిప్పి కొట్టింది. లైబీరియాకి చెందిన ఎంవి లార్డ్‌ మౌంట్‌బాటెన్‌ షాప్‌ నుంచి ఐఎన్‌ఎస్‌ శారద షిప్‌కి ముందుగా సమాచారం అందింది. సలాలాకి 230 నాటికల్‌ మైళ్ళ దూరంలో ఈ షిప్‌ ఉంది. సమాచారం అందుకోగానే, ఐఎన్‌ఎస్‌ శారద అక్కడికి చేరుకుంది. ఇండియన్‌ నేవీకి చెందిన మెరైన్‌ కమెండోలు, ఆర్మ్‌డ్‌ హెలికాప్టర్‌ సహాయంతో, పైరేట్లపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో పైరేట్ల నుంచి హై క్యాలిబర్‌ ఎకెఎం రైఫిల్‌ని, ఒక ఫుల్‌ మ్యాగజైన్‌నీ మెరైన్‌ కమెండోస్‌ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఏ ప్రిల్‌ 6 నుంచి గల్ఫ్‌ ఆఫ్‌ అదెన్‌లో ఐఎన్‌ఎస్‌ శారదను మోహరించి ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com