పైరసీ యత్నాన్ని తిప్పికొట్టిన ఇండియన్ నేవీ
- May 18, 2017
గల్ఫ్ ఆఫ్ అదెన్‌లో పైరసీ యత్నాన్ని ఇండియన్ నేవీ పెట్రోల్ షిప్ ఐఎన్ఎస్ శారద తిప్పి కొట్టింది. లైబీరియాకి చెందిన ఎంవి లార్డ్ మౌంట్‌బాటెన్ షాప్ నుంచి ఐఎన్ఎస్ శారద షిప్కి ముందుగా సమాచారం అందింది. సలాలాకి 230 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ షిప్ ఉంది. సమాచారం అందుకోగానే, ఐఎన్ఎస్ శారద అక్కడికి చేరుకుంది. ఇండియన్ నేవీకి చెందిన మెరైన్ కమెండోలు, ఆర్మ్డ్ హెలికాప్టర్ సహాయంతో, పైరేట్లపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో పైరేట్ల నుంచి హై క్యాలిబర్ ఎకెఎం రైఫిల్‌ని, ఒక ఫుల్ మ్యాగజైన్నీ మెరైన్ కమెండోస్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఏ ప్రిల్ 6 నుంచి గల్ఫ్ ఆఫ్ అదెన్‌లో ఐఎన్ఎస్ శారదను మోహరించి ఉన్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







