వడ్డీ రేట్ల ఘాటు కాస్త తగ్గింది
- May 18, 2017
యాక్సిస్ బ్యాంకు గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎస్బిఐ, ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్‌డిఎఫ్‌సిలు ఈ రంగం వడ్డీ రేట్లకు కోత పెట్టిన విషయం తెలిసిందే. కాగా యాక్సిస్ బ్యాంకు పరిశ్రమలోనే అతి తక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్ వడ్డీ రేట్లను 30 బేసిస్ పాయింట్ల మేర కోత పెట్టింది. దీంతో రూ.30లక్షల లోపు గహరుణాలపై 8.35శాతం వడ్డీని వసూలు చేయనుంది. మే 16 నుంచి కొత్తగా సమీక్షీంచిన వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చాయి. స్వయం ఉపాధి పొందే వర్గాలకు మాత్రం రూ.30లక్షలలోపు గహరుణాలపై వడ్డీ రేటును 8.40 శాతంగా నిర్ణయించింది. రూ. 30లక్షల నుంచి రూ.75లక్షల లోపు విలువైన గహరుణాలు వేతన వర్గాలకు 8.65శాతానికి, స్వయం ఉపాధి పొందే వర్గాలకు 8.70శాతంగా నిర్ణయించింది. పరిశ్రమలోనే ఇవే అత్యంత కనిష్టస్థాయి వడ్డీ రేట్లని ఆ బ్యాంకు పేర్కొంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







