ప్రభాస్ అందగాడు అంటున్న దేవసేన
- May 18, 2017
ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ అయిన అనుష్క ఇంటర్వ్యూ వీడియోకు మంచి రెన్సాన్స్ వస్తోంది. ఇందుకు కారణం రెబల్ స్టార్ ప్రభాస్, రానాతో తన అనుబంధాన్ని స్వీటీ అనుష్క చెప్పడమే. అనుష్క ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర ప్రశ్నకు తన సమాధానంగా ప్రభాస్ పేరు చెప్పేసింది. అసలు ఏమైందంటే.. బాహుబలిలో నటించిన ప్రభాస్, రానాలలో ఎవరు అందంగా ఉంటారని యాంకర్ స్వీటీని అడగిన వెంటనే అసలు తడుముకోకుండా ప్రభాస్ అందగాడని చెప్పింది. ఆపై ఇద్దరిలో ఎవరు సెక్సీగా ఉంటారని కూడా మరోప్రశ్నను సంధించింది. మరోసారి ఏ ఆలోచన లేకండానే ప్రభాస్ పేరు చెప్పింది అనుష్క.
ఆశ్చర్యపోయి అలాగే తనను చూస్తున్న యాంకర్‌కు.. ఆయన (రానా) తనకు సోదరుడి లాండి వాడని చెప్పింది. అందుకే తాను రానాను బ్రదర్ అనే ఎప్పుడూ పిలుస్తానని అంటోంది. బిల్లా, మిర్చి మూవీలతో హిట్ పెయిర్‌గా నిలిచిన అనుష్క, ప్రభాస్ బాహుబలి ప్రాజెక్టులో మరోసారి జతకట్టి సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం బాహుబలి మూవీ సక్సెస్‌ను యూనిట్ ఎంజాయ్ చేస్తోంది. అనుష్క ప్రస్తుతం జి.అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భాగమతి’ లో నటిస్తుంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







