హారర్ సినిమాగ రాబోతున్న రేష్మీగౌతమ్ 'అంతకుమించి'
- May 18, 2017
సతీశ్ జై, రేష్మీగౌతమ్ జంటగా నటిస్తున్న చిత్రం 'అంతకుమించి'. జానీ దర్శకుడు. సతీశ్ నిర్మాత. హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్ జరుగుతోంది. వచ్చే నెలలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. రేష్మీ మాట్లాడుతూ ''ఇందులో నా పాత్ర పేరు మధుప్రియ. ఇప్పటి వరకూ ఇలాంటి పాత్ర చెయ్యలేదు. టైటిల్‌కు సరిగ్గా సరిపోయే సినిమా ఇది. కొత్త అంశంతో తెరకెక్కుతున్న సినిమా ఇది. కథ, కథనాలు ఆసక్తిగా ఉంటాయి'' అని తెలిపింది. ''హారర్ థ్రిల్లర్ ఇది. హారర్‌లో కొత్త జోనర్ చూపిస్తున్నాం. హీరో, హీరోయిన్ లకు గుర్తుండిపోయే సినిమా అవుతుంది.
70 శాతం షూటింగ్ పూర్తయింది.'' అని దర్శకుడు చెప్పారు. మిగిలిన రెండు పాటల్ని గోవాలో చిత్రీకరిస్తాం. త్వరలో పాటల్ని, వచ్చే నెలలో సినిమాను విడుదల చేస్తాం'' అని నిర్మాత చెప్పారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







