మినీ మహానాడు కోసం కువైట్ చేరుకున్న మంత్రి కొల్లు రవీంద్ర

- May 19, 2017 , by Maagulf

న్యాయశాఖ ,యువజన క్రీడలు,యువజన సర్వీసులు,స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎన్.ఆర్.ఐ ఎంపవర్మెంట్ & రిలేషన్స్ గా పదవి స్వీకరించిన శ్రీ కొల్లు రవీంద్ర తమ మొదటి పర్యటన నిమిత్తం కువైట్ లో ప్రవాసాంధ్ర తెలుగు దేశం -కువైట్ వారి ఆధ్వర్యంలో జరగనున్న మినీ మహానాడు కు ముఖ్య అతిధి గా విచ్చేసారు. ఈ సందర్భంగా కువైట్ కు చేరిన కొల్లు రవీంద్ర ని ప్రవాస తెలుగు దేశం కువైట్ ప్రెసిడెంట్ ముల్కల సుబ్బారాయుడు, తెలుగు దేశం కువైట్ ప్రెసిడెంట్ సుధాకర్ రావు కుదరవల్లి,వెంకట్ కోడూరి,రమేష్,నాగేంద్ర,రహమతుల్లా,బాబు నాయుడు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్య లో విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. కొల్లు రవీంద్ర తో మీడియా సమీక్షకై మాగల్ఫ్ అధినేత శ్రీకాంత్ చిత్తర్వు, తెలుగు విద్యార్థి అధినేత కొల్లూరి వెంకట శివ కుమార్  ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com