మలయాళ స్టార్ డైరెక్టర్ తో విక్టరీ వెంకటేష్ మూవీ
- May 19, 2017
మన సినిమా కథలు ఎప్పుడూ హీరోల చుట్టూనే తిరుగుతుంటాయి. తరతరాలుగా ఇది మారని సత్యం. ఏ సినిమా కథ అయినా హీరో ఇమేజ్ ను మరింత బిల్డప్ చేయడానికి దోహదపడేదిగానే తయారు చేస్తారు. ఇది ఎవరూ కాదనలేరు. ఒకవేళ ఎవరైనా మంచి కథ రాసినా దానిని హీరో ఇమేజ్ చట్రంలోకి మౌల్డ్ చేసేస్తారు. అయితే మన హీరోలు ఇప్పుడిప్పుడే ఇమేజ్ చట్రం నుంచి బయటపడుతున్నట్టు కనిపిస్తోంది.
తమిళంలోనూ, మలయాళంలోనూ హీరో ఇమేజ్ కన్నా బలమైన కథకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రొటీన్ ఫార్ములా సినిమాలు కాక మంచి సినిమాలు వస్తున్నాయి. దర్శకులూ వాటినే ప్రిఫర్ చేస్తున్నారు. మనసును కదిలించే కథలను సిద్ధం చేయడం .. ఆ కథలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించడంలో మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ సిద్ధహస్తుడు.
తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఆణిముత్యాల్లాంటి సినిమాలను ప్రియదర్శన్ తీశాడు. రీసెంట్ గా మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రగా 'ఒప్పం' సినిమాను ప్రేక్షకులకి అందించాడు. వైవిధ్యభరితమైన సినిమాగా ప్రశంసలు అందుకున్న ఈ సినిమా, కాసుల వర్షం కురిపించింది. దాంతో తన కోసం ఒక మంచి కథని రెడీ చేయమని ఆయనని వెంకటేశ్ కోరాడట.
వెంకటేష్ కోరినదానికి పాజిటివ్ గా స్పందించిన ప్రియదర్శన్ అదే పనిలో ఉన్నాడని అంటున్నారు. ఆ కథ వెంకటేశ్ కి నచ్చితే .. ఈ కాంబినేషన్లో ఓ సినిమాకు త్వరలోనే ముహూర్తం కుదురుతుందని అనుకుంటున్నారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్‌కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









