పరిటాల యువసేన మరియు తెలుగు యువత కువైట్ ఆధ్వర్యంలో ఆత్మీయ సభ

- May 19, 2017 , by Maagulf

కువైట్ లో పరిటాల యువసేన మరియు తెలుగు యువత కువైట్ ఆధ్వర్యంలో  ద్వహి హోటల్ లో ఆత్మీయ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా న్యాయశాఖ ,యువజన క్రీడలు,యువజన సర్వీసులు,స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎన్.ఆర్.ఐ ఎంపవర్మెంట్ & రిలేషన్స్ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర విచ్చేసారు.కొల్లు రవీంద్ర తనకి పరిటాల రవి తో ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమములో  ఆయనతోపాటు అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ చమన్, మాజీ ఎం.యల్.సి చంగల్రాయుడు మరియు తెలుగు దేశం కార్యకర్తలు మరియు పరిటాల రవి అభిమానులు పాల్గొన్నారు. అందరికి ఈ సంఘం అధ్యక్షులు మల్లికార్జున్ ధన్యవాదాలు తెలియజేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com