ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో ఎస్.వి గరుడ వేగ లో
- May 19, 2017
జార్జ్, రాక్షసుడి మానవ రూపం.. అతని ఆలోచన కపటం, ఒళ్ళు విషం, అతనితో పొత్తే వినాశనం… శారీరకంగా అవిటివాడు కావచ్చు, కానీ మానసికంగా అత్యంత బలవంతుడు, అతని బుద్ధి తో డ్డి కొట్టి గెలవడం అసాధ్యం.. అతనితో బేరానికి దిగలేరు,భయపెట్టి బతకలేరు.. వేటకు దిగిన మృగం కంటే క్రూరుడు… జాలి,దయ,ప్రేమ,కరుణ అతని డిక్షనరీ లో నే లేవు… తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి, ముఖ్యంగా కబాలి,చీకటి రాజ్యం వంటి చిత్రాల్లో విలన్ పాత్రల్లో జీవించి మెప్పించిన కిషోర్..తిరిగి ఒక అత్యంత బలమైన ప్రతినాయకుడి జార్జ్ పాత్ర ని ఎస్ వి గరుడ వేగ మూవీలో పోషించనున్నారు, జార్జ్ పాత్ర భారతీయ చలనచిత్ర లో అత్యంత గొప్ప ప్రతినాయకులైన మొగాంబో, గబ్బర్ సింగ్ ని తలపిస్తుంది. డా.రాజశేఖర్, పూజా కుమార్, అరుణ్ అదిత్, కిషోర్, రవివర్మ, చరణ్ దీప్, నాజర్ , షాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఆర్ట్ః శ్రీకాంత్, సినిమాటోగ్రఫీః అంజి, మ్యూజిక్ః శ్రీచరణ్, బ్యానర్: జ్యోస్టార్ ఎంటర్ ప్రైజెస్, నిర్మాతః కోటేశ్వరరాజు, దర్శకత్వంః ప్రవీణ్ సత్తారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







