అజ్మన్ పోలీస్ కోసం 30 పెట్రోలింగ్ వాహనాలు
- May 20, 2017
ట్రాఫిక్ సమస్యల నుంచి వాహనదారులకు ఉపశమనం కల్పించేందుకోసం అజ్మన్ పోలీసులు 20 హైటెక్ మోటర్ సైకిల్స్‌ని సమకూర్చుకున్నారు. వీటిని రోడ్లపై మోహరిస్తారు. ఎమిరేట్ రోడ్లపై వీటిని మోహరించడం ద్వారా ట్రాఫిక్ని స్మూత్‌గా నడిచేలా చూడటంతోపాటుగా, భద్రతా పరంగానూ వాహనదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అజ్మన్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ షేక్ సుల్తాన్ బిన్ అల్ నౌమి మాట్లాడుతూ, చిన్న చిన్న ఘటనలు జరిగినప్పుడు వెంటనే అక్కడికి అధికారులు చేరుకోవడానికి ఈ పెట్రోలింగ్ మోటర్ సైకిల్స్ ఉపయోగపడ్తాయని చెప్పారు. యాక్సిడెంట్లు, నేరాలు జరిగినప్పుడు ట్రాఫిక్‌లో పోలీస్ వాహనాలు ఇరుక్కుపోవడం వల్ల సంఘటనా స్థలానికి వారు వెల్లడానికి ఆలస్యమవుతోంది. అలాంటి సమస్యకు ఈ మోటర్ సైకిల్ సెట్రోలింగ్ ఎంతగానో ఉపయోగపడ్తుంది. పెట్రోలింగ్ అధికారులు, పూర్తిస్థాయిలో శిక్షణ తీసుకుంటారనీ, ఫస్ట్ ఎయిడ్ మరియు రెస్క్యూ సర్వీసుల్లోనూ వారికి శిక్షణ ఇస్తామనీ, అలాగే మోటర్ సైకిల్స్‌ని స్టేట్ ఆఫ్ ఆర్ట్ లొకేషన్ ట్రాకింగ్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటివి ఏర్పాటు చేశామని తెలిపారు. షేక్ సల్తాన్ బిన్ అబ్దుల్లా అల్ నౌమి.
తాజా వార్తలు
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!







