సౌదీ చేరుకున్న డోనాల్డ్ ట్రంప్
- May 20, 2017
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విదేశీ పర్యటనలో భాగంగా ఇవాళ సౌదీ అరేబియా చేరుకున్నారు. ఎనిమిది రోజుల పర్యటనలో ఆయన ఇజ్రాయిల్, పాలస్తీనా, బ్రసల్స్, వాటికన్, సిసిలీ వెళ్లనున్నారు. ఇస్లామ్, యూద, క్రైస్తవ పుణ్యక్షేత్ర ప్రదేశాలను టచ్ చేసే విధంగా ట్రంప్ టూర్ ప్లాన్ చేశారు. రియాద్ విమానాశ్రయంలో ఎయిర్‌ఫోర్స్ వన్ దిగింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదంపై అమెరికా, అరేబియా దేశాలు సరికొత్త నిర్ణయాన్ని తీసుకునే వీలు ఉంది. అయితే ఆయన టూర్‌పై అమెరికాలో ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఎఫ్‌బీఐ డైరక్టర్ జేమ్స్ కొమెను అర్థాంతరంగా తప్పించడంతో ట్రంప్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు ట్రంప్ రాక సందర్భంగా యెమెన్ రెబల్స్‌పై సౌదీ అరేబియా వైమానిక దాడులు చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణలో ‘ఆపరేషన్ ముస్కాన్’..
- అమర్నాథ్ భక్తులకు గుడ్ న్యూస్..
- దుబాయ్‌లో మరో 9 కొత్త మాల్స్..
- కువైట్‌లో పౌర లక్ష్యాలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ..
- దిగ్గజ పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా మృతి
- ఆగస్టు 1 నుంచి ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్.. 30 రోజులు ఫుల్ ఎంటర్టైన్మెంట్!
- తెలంగాణలో ‘వైన్ టూరిజం’..
- సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ ఫిక్స్
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!
- రియాద్‌లో తాయిఫ్ రోడ్ విస్తరణకు శ్రీకారం..!!







