ఆస్ట్రేలియాలో ప్రదీప్ సింగ్ అనే భారతీయ ట్యాక్సీ డ్రైవర్‌పై దాడి
- May 22, 2017
అసభ్య పదజాలంతో దూషణ
ఆస్ట్రేలియాలో మరోసారి జాత్యాంహకార దాడి జరిగింది. భారతదేశానికి చెందిన ప్రదీప్ సింగ్(25) అనే ట్యాక్సీ డ్రైవర్‌పై ఆస్ట్రేలియాకు చెందిన భార్యభర్తలు దాడి చేసి దూషించారు. ప్రదీప్ ఆస్ట్రేలియాలో హోటల్ మేనేజ్‌మెంట్ చదువుతూ ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. శనివారం రాత్రి టాస్మానియా రాష్ట్రంలో ఇద్దరు ప్రయాణికులను కారులో తీసుకొని వెళ్తున్నారు. సాండీ బే వద్ద గల మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్‌కు వచ్చే సరికి అందులో ఉన్న మహిళకు వాంతి వస్తున్నట్టు అనిపించింది. కారులో వాంతి చేసుకుంటే శుభ్రం చేసేందుకు రుసుం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. దీంతో ఆగ్రహించిన వారు శుభ్రపరిచేందుకే కాదు ప్రయాణ చార్జీ కూడా చెల్లించమంటూ వాగ్వాదానికి దిగారు. ప్రదీప్‌ను కొట్టడమేగాక కాలుతో తన్ని అసభ్యపదజాలంతో దూషించారు. దీంతో పోలీసులు ఆయనను రాయల్ హోబార్డ్ దవాఖానలో చేర్చినట్టు ఇన్‌స్పెక్టర్ ఇయాన్ విష్ విల్సన్ పేర్కొన్నారు. భార్యభర్తలపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. వారిని హోబార్డు మేజిస్ట్రేట్ ముందు జూన్ 26న హాజరుపరుస్తామని చెప్పారు.
ఏడాదిలో ఆస్ట్రేలియాలో ఇది మూడో జాత్యాంహకార దాడి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







