రుద్రమదేవి విడుదలకు సిద్ధం
- October 08, 2015
రుద్రమదేవి సినిమా కోసం నేను చేసిందంతా మంచే అవుతుందని అనుకుంటున్నాను. కమర్షియల్ పంథాకు భిన్నంగా ఈ సినిమా చేశాను. నేను ఎంచుకున్న దారి కొత్తది కాబట్టి నా ఇమేజ్, సినిమా ఫలితాన్ని గురించి ఆలోచించలేదు. మన చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబిస్తూ తెరకెక్కిస్తున్న గొప్ప సినిమా ఇబ్బందుల్లో పడింది.. దానిని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు నా వంతు తోడ్పాటునందించాలన్న తపనతో ఈ సినిమా చేశాను అని అన్నారు అల్లు అర్జున్. ఆయన ముఖ్య పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం రుద్రమదేవి. కాకతీయ చరిత్రలో ప్రాముఖ్యతవున్న గోన గన్నారెడ్డి పాత్రలో ఆయన కనిపించనున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుల్లో ఒకరిగా చెలామణి అవుతున్న అల్లు అర్జున్ అతిథి పాత్రలో కనిపించబోతూ ఓ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ బుధవారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివి.. రుద్రమదేవి చిత్రం విడుదవుతోంది. ఫలితం విషయంలో టెన్షన్‌కు గురవుతున్నారా? తెలుగు సినిమాకు ఇదొక సరికొత్త జోనర్. ఇలాంటి కథాంశంతో సినిమా తెరకెక్కడం టాలీవుడ్లో ఇదే తొలిసారి. ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అన్న ఉత్సుకత మాత్రం ఉంది. అంతేతప్ప సినిమా ఫలితంపై ఏ విధమైన టెన్షన్ పడటం లేదు. మీరు హీరోగా చేసిన సినిమా విడుదలవుతున్నప్పుడు ఉండే మానసకి స్థితికి, ఈ సినిమాకు ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయా? ఈ సినిమాకు నేను ఏం చేసిన పాజిటివ్ అవుతుంది తప్ప నెగెటివ్ కాదని ముందుగానే అనుకున్నాను. అవుట్ ఆఫ్ ది వే వెళ్లి ఈ సినిమా చేశాను. నేను బాగా చేసినా, చేయకపోయినా ఎంచుకున్న మార్గం కొత్తది కాబట్టి నాలో ఎలాంటి భయం లేదు. మన చరిత్ర, సంస్కృతి గురించి తెలియజెప్పే గొప్ప సినిమా ఇబ్బందుల వల్ల ఆగిపోయింది, దానికి నా వంతుగా ప్రోత్సాహాన్ని అందించాలి. ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనే ఉద్ధేశ్యంతో రుద్రమదేవి సినిమా చేశాను. గోనా గన్నారెడ్డి పాత్ర చేస్తానని మీరే స్వయంగా గుణశేఖర్‌ను సంప్రదించారని తెలిసింది? అవును. నేను తరచుగా గుణశేఖర్‌ను కలుస్తుంటాను. ఆయన ఓ సందర్భంలో రుద్రమదేవి సినిమా షూటింగ్ మొత్తం అయిపోయింది. కానీ గోనగన్నారెడ్డి పాత్ర తాలూకు సన్నివేశాలు మిగిలిపోయాయి. ఆ పాత్రకు తగిన నటుడి కోసం అన్వేషిస్తున్నాం అని చెప్పారు. అప్పుడు నేను మీకు అభ్యంతరం లేకపోతే ఆ పాత్ర నేను చేస్తాను. నా కోసం మీరు అనుకున్న క్యారెక్టర్లో కొన్ని మార్పులు చేయాల్సిరావచ్చు. అందుకు మీరు సిద్ధమైతే నేను రెడీ అని గుణశేఖర్‌తో చెప్పాను. అందుకు ఆయన ఓకే అన్నారు. అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన ఈ సినిమాకు మీలాంటి స్టార్ తోడవటం వల్ల కమర్షియల్ హంగులు వచ్చాయంటున్నారు? మన సంస్కృతి, చరిత్రను గురించి చెప్పే సినిమా ఇది. ఇలాంటి సినిమాను గుణశేఖర్ ఒక్కరే ధైర్యంగా తెరకెక్కిస్తున్నాడు. సొంతగా నిర్మిస్తున్నారు. కానీ ఆయనకు సహాయం చేయడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు. ఆ పనిని నేను ఎందుకు చేయకూడదనే ఆలోచన వచ్చింది. దానికోసం ఓ నెల రోజుల సమయం త్యాగం చేస్తే సరిపోతుంది కదా అనిపించింది. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టాను. కొన్ని గొప్ప విషయాలు చేయాలంటే డబ్బు గురించి ఆలోచించకూడదు అని నిర్ణయించుకొని గోన గన్నారెడ్డి పాత్ర చేశాను. ఈ సినిమాలో నటించాలనే మీ నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటున్నారు? మంచి చేస్తున్నాననే భావనతో ఈ సినిమాలో భాగమయ్యాను. మొదట గుణశేఖర్ ఈ క్యారెక్టర్‌ను మధ్యవయస్కుడైన వ్యక్తి కోసం సిద్ధం చేశారు. నేను యువకుడిని కాబట్టి నా ైస్టెల్కు ఎలా ఆడాప్ట్ చేసుకొవాలి? పాత్ర ఎలా ఉండాలి? అనేది డిజైన్ చేసుకున్నాను. ఇతను ఈ పాత్రకు సరిపోడు అనే స్థాయినుంచి నేను తప్ప ఈ పాత్రకు ఎవరూ న్యాయం చేయలేరు అనే స్థాయిలో నటించాలనే కసి నాలో మొదలైంది. గోన గన్నారెడ్డి పాత్రకు నేను పూర్తి స్థాయిలో న్యాయం చేశానని అనుకుంటున్నాను. గోన గన్నారెడ్డి పాత్రకు గాంభీర్యం, నిండైన విగ్రహం... అన్ని వైవిధ్యంగా ఉండాలి. మరి దాని కోసం ఎలాంటి హోమ్‌వర్క్ చేశారు? గోన గన్నారెడ్డి వయసుపైబడిన వ్యక్తి. ఒక్క ఆయనే కాదు. ఈ కథాంశానికి సంబంధించిన వాళ్లంతా చాల మంది పెద్ద వయస్కులే. కానీ మా సినిమాలో మాత్రం అందరూ యువకులే కనిపిస్తారు. చారిత్రక కథాంశాన్ని యువతరం కోణంలో చెప్పాలనే ఉద్ధేశ్యంతోనే గుణశేఖర్ ఈ సినిమాను తీశారు. ఆయన ఆలోచన నాకు నచ్చింది. ఈ సినిమాలో కొన్ని మినహా ఎక్కువ భాగం పాత్రల్లో నవతరం వారే కనిపిస్తారు. ఈ సినిమా కోసం మీరు పారితోషికం తీసుకోలేదని తెలిసింది? మీరు మంచి సినిమా తీస్తున్నారు కాబట్టి పారితోషికం గురించి ఆలోచించకండి, డబ్బును పక్కనబెట్టి ఈ సినిమాను పూర్తి చేయండి అని గుణశేఖర్‌తో చెప్పాను. పారితోషికాన్ని పక్కనపెట్టి ఈ సినిమా చేశాను. గోనగన్నారెడ్డికి సంబంధించి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. ఈ పాత్ర కోసం మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? గోనగన్నారెడ్డి అనే పేరు తప్ప ఆ పాత్రకు సంబంధించి రిఫరెన్స్ పిక్చర్స్, ప్రామాణిక ఆధారాలు ఎక్కడా లేవు. గోనగన్నారెడ్డి 13 శతాబ్దానికి చెందినవాడు. దాంతో గోనగన్నారెడ్డి ఎలా ఉంటాడు? ఆయన రూపం ఎలా ఉంటుంది? అనే సంశయం అందరిలో మొదలైంది. గోన గన్నారెడ్డి ఒక దొంగ, రాబిన్‌హూడ్ లాంటి పాత్ర కాబట్టి నల్లటి వస్ర్తధారణతో సినిమాలో చూపించాలని అనుకున్నాం. మొరటుతనం ఎక్కువగా ఉండే పాత్ర కాబట్టి చిరిగిపోయిన బట్టలతో రఫ్‌గా చూపించాం. తిరుగుబాటు తత్వం ఎక్కువగా ఉండే పాత్ర షార్ట్ హేయిర్‌తో కనిపిస్తుంది. గుణశేఖర్‌తో పాటు నా ఊహలకు అనుగుణంగా గోనగన్నారెడ్డి పాత్రను సృష్టించాం. సినిమాలపరంగా ఓ మంచి ఉద్ధేశ్యంతో ముందుకు వచ్చినా కొన్ని సార్లు విమర్శలు ఎదురవుతుంటాయి. అలాంటి అనుభవాలు మీకు ఎదురయ్యాయా? రిస్కీ ప్రాజెక్ట్ అనే విషయం తెలిసి ధైర్యంగా ఈ సినిమాను అంగీకరించాను. ఈ సినిమా విడుదల విషయంలో సందేహం ఉండేది. అలాగే హీరోగా ఉన్నప్పుడు ఇలాంటి పాత్ర చేయడం అవసరమా? ఎందుకు రిస్క్ తీసుకోవడం అని అన్నారు. కానీ గుణశేఖర్ సినిమాను ఎలాగైనా విడుదల చేస్తారనే బలమైన నమ్మకముంది. తెలుగు సినిమాల్లో ఉండే మంచి లక్షణమే నన్ను ఈ సినిమాను అంగీకరించేలా చేసింది. ప్రస్తుతం హాలీవుడ్ నటులు కూడా కథానుగుణంగా చిన్న పాత్రలు వేస్తుంటారు. హీరోలుగా నటిస్తూనే మంచి కథాంశాలతో కూడిన సినిమాల్లో భాగమవుతున్నారు. ఈ మధ్య కాలంలో నిత్యామీనన్‌లో తప్ప ఎవరిలో ఇలాంటి క్వాలిటీ చూడలేదు. హీరోయిన్గా నటిస్తూనే నచ్చిన సినిమాలు చేస్తోందామె. వృత్తిపరమైన దృక్కోణం నుంచి ఆలోచించి ఈ సినిమాలో నటించాను. ఇలాంటి పాత్రలు చాలా మంది చేశారు. ఇప్పుడు ఎందుకు చేయకూడదు? అని అనిపించింది. ఈ పాత్రను చేయాలని నిర్ణయించుకున్న తర్వాత మీరు స్వంతగా ఎలాంటి కసరత్తులు చేశారు? రెగ్యులర్ పాత్ర కాదు కదా ఏమైనా కష్టంగా అనిపించిందా? గోనగన్నారెడ్డి చరిత్ర గురించి తెలుసుకున్నాను. ఆయన తెలంగాణ మనిషి, మహబాబూనగర్ జిల్లా వాసి అని తెలిసింది. తెలంగాణ వ్యక్తి కాబట్టి తెలంగాణ మాట్లాడితే బాగుంటుంది అనిపించింది. కానీ ఇది అన్ని ప్రాంతాలకు సంబంధించిన సినిమా, అలాంటప్పుడు తెలంగాణ యాస అందరికీ అర్థమవుతుందా? అనే సందేహం కలిగింది. అయితే సినిమాలోని మిగతా పాత్రలన్నీ గ్రాంథికంలో మాట్లాడుతాయి కాబట్టి ఈ పాత్రకు తెలంగాణ భాష ఉపయోగిస్తే సినిమాలో ప్రత్యేకత ఉంటుందని అనిపించింది. తెలంగాణ యాసలో పాత్రకు సంబంధించిన సంభాషణలు సిద్ధం చేశాం. చాలా అందంగా వచ్చాయి. ఆ బ్యూటీ వస్తుందని నేను మొదటినుంచి నమ్మాను. అదే నిజమైంది. చారిత్రక కథాంశంలో భాగమయ్యే అవకాశం చాలా తక్కువ మందికి లభిస్తుంది. ఆ అవకాశం మీకు లభించడం ఎలాంటి అనుభూతిని కలిగిస్తుంది? ఒక్కో హీరోకు ఒక్కో పాత్ర చక్కటి పేరు తెచ్చిపెట్టాయి. ఎన్టీఆర్‌కు కృష్ణుడు, కృష్ణకు అల్లూరి సీతారామారాజు, కృష్ణంరాజు పోషించిన తాండ్రపాపారాయుడు పాత్రలు చరిత్రలో నిలిచిపోయాయి. అలాగే గోన గన్నారెడ్డి ఆ స్థాయిలో గుర్తింపును తెచ్చుకుంటుందనే నమ్మకముంది. తొలిసారి ఈ పాత్రను పోషించే అదృష్టం నాకు దక్కడం ఆనందంగా ఉంది. బాహుబలి తర్వాత ఈ సినిమా రావడం కలిసివస్తుందని అనుకుంటున్నారా? బాహుబలి జానపద కథాంశంతో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం. ఓ చారిత్రక వీరనారి జీవితగాథ ఆధారంగా రూపొందించిన చిత్రం రుద్రమదేవి. కథాంశాల పరంగా రెండు సినిమాల మధ్య చాలా వైరుధ్యాలు కనిపిస్తాయి. కాబట్టి రెండింటిని పోల్చి చూడటం అనవసరమని అనుకుంటున్నాను. బాహుబలి, శ్రీమంతుడు...ఇండస్ట్రీలో ఎలాంటి మార్పుల్ని తీసుకొచ్చాయి? బాహుబలి, శ్రీమంతుడు మాత్రమే కాకుండా సినిమా చూపిస్తమావ, భలే భలే మగాడివోయ్, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలు చక్కటి విజయాల్ని సాధించాయి. తెలుగు సినిమాకు మంచి సీజన్ ఇది. గత ఏడాదిన్నరగా హిట్ల పర్సెంటేజ్ తగ్గింది. చాలా సినిమాలు పరాజయాలుగా నిలిచాయి. బాహుబలితో ఇండస్ట్రీ కష్టాలకు ముగింపు పడింది. మంచి సినిమాలు వస్తున్నాయి. చాలా సినిమాలు హిట్స్‌గా నిలుస్తున్నాయి. ఆ జాబితాలో రుద్రమదేవి చేరుతుందనే నమ్మకముంది. గోనగన్నారెడ్డి చరిత్ర గురించి ఏమైనా తెలుసుకున్నారా? అడవి బాపిరాజు రాసిన గోనగన్నారెడ్డి చరిత్రను చదివాను. కానీ ఈ రచన ప్రభావం సినిమాలో నా పాత్రపై పెద్దగా లేకుండా కొత్తదనంతో చెప్పడానికే ప్రయత్నించాం. మొదటిసారి ఈ పాత్రకు ఓ విజువలైజేషన్ రాబోతుంది కాబట్టి మేము అనుకున్నట్లుగానే చూపించాలని అనుకున్నాం. మేము చెప్పేదే రిఫరెన్స్ పాయింట్ అని స్ట్రాంగ్‌గా నమ్మి పాత్రను తీర్చిదిద్దాం. పాత్ర లుక్, ఆయుధాలు, తీరుతెన్నులు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నాం. ఎక్కడా అలసత్వం ప్రదర్శించలేదు. లాజిక్‌లకు అనుగుణంగానే వర్క్ చేశాం. తెలంగాణ యాసను మీరు పూర్తి స్థాయిలో ఉపయోగించడం ఇదే మొదటిసారా? ఇప్పటి వరకు చాలా సినిమాల్లో హీరోలు తెలంగాణ భాషను సందర్భానుగుణంగానే వాడుతూ వచ్చారు. కానీ పూర్తి స్థాయిలో ఎవరూ ఉపయోగించలేదు. తెలంగాణ శైలిని సినిమాలో ప్రారంభం నుంచి ముగింపు వరకు ఉపయోగిస్తూ రానున్న తొలి చిత్రమిది. స్వచ్ఛమైన తెలంగాణ భాషను వాడటం జరిగింది. తెలంగాణ భాషపై మీకు అంతగా పట్టులేదు కదా? దాని కోసం ప్రత్యేకంగా ఎలాంటి శిక్షణ తీసుకున్నారు? అవును. తెలంగాణ యాసపై పరిజ్ఞానం నాకు తక్కువ కాబట్టి కొంత కసరత్తు చేయాల్సివచ్చింది. ఈ విషయంలో చేవేళ్ల రవి, జబర్ధ్దస్త్ వేణుతో పాటు సంభాషణల రచయిత రాజసింహా, డబ్బింగ్ ఆర్టిస్ట్ పప్పు నాకు సహకరించారు. గుణశేఖర్‌తో మీరు చేసిన వరుడు సినిమా సరైన ఫలితాన్ని అందించలేదు. అయినా ఏ నమ్మకంతో ఈ పాత్ర చేయడానికి అంగీకరించారు? వరుడు సినిమాను గుణశేఖర్‌తో పాటు నేను చాలా నమ్మాను. వందశాతం ఎఫెర్ట్ పెట్టి చేశాం. అయితే కథ విషయంలో జరిగిన పొరపాట్ల వల్ల సినిమా సరైన ఫలితాన్ని అందుకోలేదు. అయితే అందుకు గుణశేఖర్‌ను పూర్తిగా బాధ్యతను చేయడం తప్పని అనుకుంటున్నాను. పరాజయంలో ఆయన తప్పేం లేదు. ఫ్లాప్ ఇచ్చినా కూడా ఆయనపై నాకు గౌరవం, నమ్మకం తగ్గలేదు.కష్టపడ్డా సక్సెస్ చేయలేకపోయాడు. బాహుబలి తర్వాత ఈ సినిమా రావడం ఈ సినిమాకు మైనస్సా? లేకా ప్లస్సా? సినిమా ఆలస్యం కావడం నా దృష్టిలో ఎప్పటికి మైనస్ అనుకుంటాను. బాహుబలికి ముందే వచ్చుంటే బాగుండేది అనుకుంటున్నాను. అందరూ ఈ సినిమాను బాహుబలితో పోలుస్తున్నారు. ఆ సినిమా కంటే ముందే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి వుంటే ఈ పోలిక వుండేది కాదని అనుకుంటున్నాను. భవిష్యత్‌లో పూర్తి స్థాయి చారిత్రక సినిమా చేసే ఆలోచన ఉందా? హీరోగా నాకు అలాంటి ఆలోచన ఉన్నా తీసే వాళ్లు మాత్రం ఉండటం లేదు. దర్శకుల దృక్పథాల్లో మార్పు రావాలి. వారు ఇలాంటి కథాంశాల పట్ల స్ఫూర్తిపొందాలి. వారు సినిమాలు తీయడానికి ముందుకు వస్తే హీరోలు తప్పకుండా ఇలాంటి సినిమాలు చేస్తారనే నమ్మకముంది. పెద్ద హీరోలతో సినిమాలు తీసి పెద్ద దర్శకుణ్ణి అనిపించుకోవాలనే ఆశ లేదు. జనరంజకమైన చిత్రాల్ని తీస్తూ ్ర పేక్షకుల్ని అలరించాలన్నదే నా సిద్ధాంతం అని .. కొమురం భీమ్ వంటి విప్లవ వీరుడు పుట్టిన గడ్డ అదిలాబాద్ జిల్లా. గత ఏడాది కొమురం భీమ్ జయంతి ఉత్సవాల్ని జోడేఘాట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింద.. రుద్రమదేవి ముని మనవడివా..అని విమర్శించారు! కలను ప్రేమించిన వాడే దానిని సాఫల్యం చేసుకోగలుగుతాడు నీలో నిరంతరం చైతన్యాన్ని కలిగిస్తూ నిదురపోకుండా చేసే.. రకుల్‌ప్రీత్‌సింగ్ కెరీర్ మంచి జోరుమీదుంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ విజయం తరువాత తెలుగు,తమిళ పరిశ్రమ వర్గాల్ని ఆకర్షించిన ఈ పంజాబీ భామ తెలుగులో ప.. చాలా రోజుల విరామం తర్వాత నేను నటిస్తున్న పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమిది. ఇందులో సోగ్గాడిగా, అమాయకుడిగా రెండు భిన్న పార్శాలున్న పాత్రల్ని పోషిస.. ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు మృతిపట్ల తెలుగు చిత్రసీమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. విలువలతో కూడిన కళాత్మక చిత్రాల్ని నిర్మించిన ఆయన మరణ.. ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు మృతిపట్ల తెలుగు చిత్రసీమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. విలువలతో కూడిన కళాత్మక చిత్రాల్ని నిర్మించిన ఆయన మరణ.. దుల్కర్సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించిన మలయాళ చిత్రం ఉస్తాద్ హోటల్. అన్వర్ రషీద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో జతగా పేరుతో సురేష్ కొండే.. సినిమాలకు కొంత విరామాన్ని తీసుకున్న పంజాబీ ముద్దుగుమ్మ తాప్సీ ప్రస్తుతం హిందీలో రూపొందిస్తున్న ఓ లఘు చిత్రంలో నటిస్తోంది. బాలీవుడ్ దర్శకుడు టిగ్మన్.. ఐశ్వర్యరాయ్ పునరాగమనం చేస్తున్న చిత్రం జజ్బా. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ఆమె నటిస్తున్న ఈ చిత్రం బాలీవుడ్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఓ మహిళా న్య.. రవితేజ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం... ఓ పోలీస్ అధికారిపోరాటం నేపథ్యంలో స్టెలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన తమిళ చిత్రం తని ఒరువన్. జయం రవి కథానాయకుడిగా రూపొందిన ఈ చిత్రం చక్కటి వ.. శ్రీ నేత్ర క్రియేషన్స్ పతాకంపై సుజాత రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం రిక్వెస్ట్. జస్ట్ లైక్ వార్న్ చిత్ర ఉపశీర్షిక. ప్రశాంత్, శ్రీవల్ల.. పా విజయ్ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం స్ట్రాబెరి. ఈ సినిమాను అదే పేరుతో నిర్మాత పి. సాంబశివరెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్..
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







