అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను సినిమా
- October 08, 2015
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ సైలెంటుగా సాగిపోతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి టైటిల్ కూడా ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది. వర్కింగ్ టైటిల్ మాత్రమే అంటూ 'సరైనోడు' అనే టైటిల్ ప్రచారంలోకి తెచ్చారు యూనిట్ సభ్యులు. అయితే దర్శకుడు బోయపాటి ఇదే టైటిల్ అఫీషియల్ టైటిల్ అని తేల్చేసాడట. అయితే ఈ విషయాన్ని ఇప్పుడే బయట పెట్టకుండా సంక్రాంతికి విడుదలయ్యే ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారానే ప్రకటించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో బోయపాటి శ్రీను రకుల్ ప్రీత్ సింగ్ ను ఎమ్మెల్యే క్యారెక్టర్లో చూపించబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటి వరకు రకుల్ ప్రీత్ సింగ్ అంటే గ్లామర్ డాల్ గానే మనకు తెలుసు. అయితే ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ఎలా కనిపించబోతోంది. గ్లామరస్‌గా కనిపిస్తుందా? లేక ఎమ్మెల్యే పాత్రలో పవర్ ఫుల్‌గా కనిపించబోతోందా? అనేది తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అల్లుఅర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్ రూపొందుతోన్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. రకుల్‌ప్రీత్ సింగ్, కేథరిన్ హీరోయిన్స్. శ్రీకాంత్, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే అల్లు అర్జున్, కేథరిన్, ఆది పినిశెట్టి తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించారు. బన్నీ తన సినిమాల్లో స్త్టెల్‌కి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇందులోనూ విభిన్నమైన గెటప్‌లో కనిపించబోతున్నారట. యాక్షన్‌తో పాటు వినోదం, కుటుంబ బంధాలకూ ఈ చిత్రంలో ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







