హృదయనాథ్ మంగేష్కర్ అవార్డ్ కు రెహమాన్ ఎంపిక
- October 08, 2015
భారతీయ సంగీతానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువచ్చిన సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్. ప్రతీ సినీ సాంకేంతిక నిపుణుడు సాంధించాలనుకునే ఆస్కార్ అవార్డ్ ను కూడా సొంతం చేసుకున్న రెహమాన్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ నిర్మాత దర్శకుడు సుభాష్ ఘయ్ ఏర్పాటు చేసిన హృదయనాథ్ మంగేష్కర్ అవార్డ్ కు రెహమాన్ ఎంపిక అయ్యాడు. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్, ఆశాభోంస్లేల సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ పేరు మీద ఈ అవార్డ్ ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే లతా మంగేష్కర్, ఆశాభోంస్లే, అమితాబ్ బచ్చన్, సులోచన టాయ్ లకు ఈ అవార్డ్ ను అందించారు. ఈ ఏడాదికి గాను ఎఆర్ రెహమాన్ ను ఎంపిక చేశారు. సౌత్ లో సంగీత దర్శకుడిగా పరిచయం అయినా... తన టాలెంట్ తో బాలీవుడ్, ఆ తరువాత హాలీవుడ్ స్థాయికి ఎదిగిన మ్యూజిక్ సెన్సేషన్ రెహమాన్. 2009లో హాలీవుడ్ దర్శకుడు డానీ బోయల్ తెరకెక్కించిన స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు సంగీతం అందించిన రెహమాన్ ఆ సినిమాకు రెండు ఆస్కార్ లను అందుకున్నాడు.
తాజా వార్తలు
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!







