ఈశాన్య జకర్తాలో భారీ పేలుళ్లు
- May 24, 2017
జకర్తా: ఇండోనేషియా బాంబులతో దద్దరిల్లింది. ఈశాన్య జకర్తాలో భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఓ బస్ స్టేషన్ కు సమీపంలో రెండు వరుస పేలుళ్లు చోటు చేసుకోవడం పెద్ద మొత్తంలో గాయపడ్డారు. ఓ పోలీసు అధికారి ఈ బాంబు పేలుళ్ల గురించి మాట్లాడుతూ పేలుడు బుధవారం రాత్రి 9గంటల ప్రాంతంలో చోటు చేసుకుందని, జరిగిన నష్టం తీవ్రత చూస్తుంటే భారీ పేలుడని చెప్పగలనని అన్నారు. కాంపంగ్ మెలయు బస్ టెర్మినల్ వద్ద ఈ పేలుడు చోటు చేసుకుందని, ఇక్కడ నుంచి మినీ బస్సులు, పెద్ద బస్సులు నడుస్తాయని అన్నారు. గాయపడిన వారిని ఆస్పత్రిలోకి చేర్పించినట్లు తెలిపారు.
అయితే, ప్రాణనష్టం, గాయపడిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశంగా ఇండోనేషియాకు పేరుంది. పైగా ఆసియాలోనే పర్యాటకానికి, చక్కటి సహజ సిద్ధ ప్రకృతికి నిలయమైన ఈ దేశంలో కూడా పేలుళ్లు చోటు చేసుకోవడం అక్కడి వారు ఉలిక్కి పడ్డారు. పేలుళ్ల సంభవించిన చోటుకి రక్షణ బలగాలు కదులుతున్నాయి. ఈ దాడిని తామే చేసినట్లు ఏ ఉగ్రవాద సంస్థ ఇంకా ప్రకటించలేదు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









