రవిచంద్రన అశ్విన్ కు ఇంటర్నేషనల్‌ అవార్డు

- May 24, 2017 , by Maagulf
రవిచంద్రన అశ్విన్ కు ఇంటర్నేషనల్‌ అవార్డు

రవిచంద్రన అశ్విన ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు అందుకున్నాడు. బుధవారం ఇక్కడ సియెట్‌ క్రికెట్‌ రేటింగ్‌ ఇంటర్నేషనల్‌ అవార్డుల కార్యక్రమం జరిగింది. దిగ్గజ ఆటగాడు సునీల్‌ గవాస్కర్‌, ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన హర్ష్‌ గోయెంకా.. అశ్వినకు ఈ అవార్డు ప్రదానం చేశారు. యువ బ్యాట్స్‌మన శుభమ్‌ గిల్‌ 'యంగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డు కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా అశ్విన మాట్లాడుతూ.. చెన్నై చెపాక్‌ స్టేడియంలో గవాస్కర్‌ నుంచి తాను అందుకున్న తొలి ఆటోగ్రాఫ్‌ క్షణాలను గుర్తు చేసుకున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com