సౌదీ అరేబియాలో ఆంధ్ర మహిళకు కష్టాలు

- May 25, 2017 , by Maagulf
సౌదీ అరేబియాలో ఆంధ్ర మహిళకు కష్టాలు

సౌదీ అరేబియా:సౌదీలోని ఓ ఇంట్లో పాచిపని చేసేందుకు వెళ్లిన మహిళ అక్కడ నరకయాతన అనుభవిస్తోంది. నెల్లూరు జిల్లా కావలి పెంకుల ఫ్యాక్టరీ గిరిజన కాలనీకి చెందిన చౌటూరి కాంతమ్మ(55), స్థానిక ఏజెంటు షేక్‌ ఫయాజ్‌ ద్వారా 2016 సెప్టెంబరులో సౌదీ అరేబియాకు వెళ్లింది. రెండు నెలల తరువాత కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి యజమాని చిత్రహింసలు పెడుతున్నాడని తనను తిరిగి స్వదేశానికి పిలిపించాలని వేడుకుంది. దీంతో ఆవేదన చెందిన కుటుంబసభ్యులు, ఆమెను వెనక్కు పిలిపించడానికి ఖర్చుల నిమిత్తం ఏజెంట్‌కు రూ.80వేలు చెల్లించారు. కానీ ఆతడి నుంచి స్పందన లేకపోవడంతో వారంతా గురువారం కావలి డీఎస్పీ రాఘవరావును కలసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com