మెగాస్టార్ చిరంజీవి సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ కీ రోల్

- May 25, 2017 , by Maagulf
మెగాస్టార్ చిరంజీవి సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ కీ రోల్

మెగాస్టార్ చిరంజీవి తన రీ ఎంట్రీ మూవీ 150 వ సినిమా ఖైదీ నెంబర్ 150 తో సూపర్ హిట్ అందుకొన్నాడు. తాజాగా 151 సినిమాను పట్టాలెక్కించే సన్నాహల్లో చిత్ర యూనిట్ ఉన్నారు.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్ర్య సమరయోధుడు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవితం ఆధారంగా తెరకెక్కనున్నది. ఈ సినిమా ను నిర్మాత రామ్ చరణ్ ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు సన్నాహల్లు చేస్తున్నారు.. ఈ సినిమాపై చిత్ర పరిశ్రమలో.. అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్న నేపద్యంలో ప్రముఖ తారాగణం తో పాటు సాంకేతిక నిపుణులను కూడా సెలెక్టివ్ గా తీసుకొంటున్నారు.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ ఓ కీ రోల్ లో నటించనున్నారు. బిగ్ బీ కి ఇప్పటికే కధ వినిపించగా.. ఆయన నటించడానికి ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. కాగా తనకు చిరంజీవి సినిమాలో గెస్ట్ రోల్ లో నైనా నటించాలని ఉన్నది అని చెప్పిన సంగతి విధితమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com