చేనేత వస్త్రాలతో .. సెక్సీగా హీరోయిన్ సమంత
- May 25, 2017
దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత.. మంచి నటిగా సినీ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు.. మంచి మనసున్న మనిషిగా అందరి మనసును దోచింది.. సమంతను తెలంగాణ ప్రభుత్వం చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసినప్పటి నుంచి తన వంతు సాయం చేస్తూనే ఉన్నది.. క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్యలను అర్ధం చేసుకొని వాటి పరిస్కారం దిశగా అడుగులు వెస్తోన్న సమంత అందరి మన్ననలను పొందుతుంది. ఇప్పుడు సమంత చేనేత రంగ అభివృద్ది కోసం తనవంతుగా నడుం బిగించేసింది.
తాజాగా సమంత చేనేత కోసం ఓ ఫోటో షూట్ చేసింది. జేఎఫ్ డబ్ల్యూ మేగజైన్ కోసం ఈ పోజ్ ఇచ్చిన సమంత.. 'తెలంగాణ కళాకారులు'.. 'చేనేత వస్త్రాలు'.. 'హ్యాండ్ లూమ్స్ లో సెక్సీగా' అనే అర్ధం వచ్చేలా హ్యాష్ ట్యాగ్ లు పెట్టి.. తెలంగాణ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మరో అడుగు ముందుకు వేసింది . చేనేత వస్త్రాలు అంటే ముతకగా ఉంటాయని.. ఓల్డ్ ఫ్యాషన్ అనే ఫీలింగ్ వుంది. అయితే సమంత డ్రెస్ చూశక ఆ ఫీలింగ్ మారిపోతుంది మరి. అయినా సమంత లో ఇంత కమిట్ మెంట్ ఉంది కనుకనే నాగ చైతన్య వంటి మంచి మనసున్న వ్యక్తికి భార్య గా.. అక్కినేని ఫ్యామిలీ లో అడుగు పెట్టే అదృష్టం దక్కించుకొన్నది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత







