జిసిసి రైల్‌ నెట్‌వర్క్‌కి గ్రీన్‌ సిగ్నల్‌

- October 08, 2015 , by Maagulf
జిసిసి రైల్‌ నెట్‌వర్క్‌కి గ్రీన్‌ సిగ్నల్‌

గల్ఫ్‌ దేశాల కౌన్సిల్‌ (జిసిసి) రైల్‌ నెట్‌వర్క్‌ షెడ్యూల్‌ ప్రకారం 2018 నాటికి గ్రీన్‌ సిగ్నల్‌ పొందనుంది. మీడ్‌ ప్రాజెక్ట్స్‌ డైరెక్టర్‌ మరియు కంటెంట్‌ అండ్‌ అనాలసిస్‌ ఎడ్‌వార్డ్‌ జేమ్స్‌ మాట్లాడుతూ, జీసీసీ దేశాలు రైల్‌ నెట్‌ వర్క్‌పై అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, పనులు శరవేగంగా పూర్తి చేయాలని నిర్ణయించాయని చెప్పారు. ప్రతిష్టాత్మకమైన జిసిసి రైల్వే ట్రాక్‌ ఇంకా ప్లానింగ్‌ స్టేజ్‌లోనే ఉంది. అధికారికంగా 2018 నాటికి ఈ ప్రాజెక్ట్‌ పూర్తవ్వాల్సి ఉంది. అయితే 2020 నాటికిగానీ పనులు పూర్తయ్యే అవకాశం లేదంటున్నారు. అక్టోబర్‌ 15న జరిగే సమావేశంలో జిసిసి దేశాలు రైల్‌ నెట్‌ వర్క్‌ వాస్తవ పరిస్థితుల్ని సమీక్షించి, కీలక నిర్ణయం తీసుకోనున్నాయి. ఎడారి ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌ని నిర్మించవలసి ఉండడంతో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతాయనీ, వాటిని అధిగమించడానికి ఎంతో శ్రమించాల్సి ఉంటుందని ఎడ్‌వార్డ్‌ జేమ్స్‌ చెప్పారు. 11 బిలియన్‌ డాలర్ల విలువైన ఎతిహాద్‌ రైల్‌ ప్రాజెక్ట్‌లో 264 కిలోమీటర్ల మేర ట్రాక్‌ నిర్మాణం షా హబ్‌షాన్‌ మరియు పోర్ట్‌ ఆఫ్‌ రువాయిస్‌ మధ్య ఇప్పటికే పూర్తయ్యింది. 1200 కిలోమీటర్ల యూఏఈ రైల్‌ నెట్‌వర్క్‌లో ఇది ఓ ఫేజ్‌. రెండో ఫేజ్‌లో 628 కిలోమీటర్ల మేర ట్రాక్‌ నిర్మాణం పూర్తి కావలసి ఉంది. మూడో ఫేజ్‌లో 279 కిలోమీటర్ల ట్రాక్‌ నిర్మాణం జరుగుతుంది. 

 

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com