మాస్లర్ బ్లాస్టర్ సచిన్‌ను సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించిన ‘ఎ బిలియన్ డ్రీమ్స్’
- May 26, 2017
మాస్లర్ బ్లాస్టర్ సచిన్ జీవితచరిత్రపై తెరకెక్కిన సినిమా ఎ బిలియన్ డ్రీమ్స్ చూసిన సెలబ్రిటీలు సినిమాపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సచిన్‌ను ట్వీట్లతో ముంచెత్తుతున్నారు. మాస్టర్ రిటైర్మెంట్‌తో నాలుగేళ్లుగా మూగబోయిన అభిమానులు.. మళ్లీ ఇన్నాళ్లకు పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదని టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ అభిమానులకు పిలుపునిచ్చాడు. మాస్టర్ గురించి ఎన్నో తెలియని విషయాలు, అతనికి ఎదురైన సవాళ్ల గురించి సినిమా కళ్లకు కట్టినట్లు చూపించిందని ధోనీ చెప్పాడు. సచిన్.. నీకెవరూ సాటిరారు అంటూ మరో వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ ట్వీట్ చేశాడు. ప్రతి ఇండియన్‌లోనూ స్ఫూర్తి నింపిన సచిన్ సర్‌కు కృతజ్ఞతలు అంటూ రహానే ట్వీట్ చేశాడు. క్రికెటర్లతో పాటు ఈ స్పెషల్ షోని బాలీవుడ్ లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, ఆశా భోంస్లే, ఆమిర్‌ఖాన్, షారుక్ ఖాన్, అనిల్‌కపూర్, ఐశ్వర్య రాయ్, ఏఆర్ రెహమాన్ చూశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ సినిమాను ఆకాశానికెత్తారు. సచిన్ ఉన్న దేశంలో నివసిస్తున్నందుకు గర్వంగా ఉందంటూ అమితాబ్ ట్వీట్ చేయడం ప్రత్యేకతను సంతరించుకుంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







