ఈజిప్టులో ఓ బస్సుపై గన్మెన్ దాడి: 23మంది మృతి
- May 26, 2017
ఈజిప్టులో ఓ బస్సుపై గన్మెన్ విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో దాదాపు 23 మంది ప్రాణాలు కోల్పోగా.. 25 మందికి పైగా గాయపడినట్లు అక్కడి స్టేట్ టీవీ వెల్లడించారు. శుక్రవారం మిన్యా ప్రావిన్స్లోని సెయింట్ శామ్యూల్ మోనస్టీ నుంచి బయలుదేరిన బస్సుపై కాల్పులు జరిగాయి. దాడిని ఈజిప్టు ఆరోగ్య మంత్రిత్వశాఖ కూడా ధ్రువీకరించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాల్పులు జరిపిన వ్యక్తి కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు.
గత నెల ఈజిప్టులోని రెండు ప్రముఖ చర్చిలపై గంటల వ్యవధిలోనే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేసి మారణహోమం సృష్టించారు. ఈస్టర్ పండుగకు వారం ముందు ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో దాదాపు 47 మందిపైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







