జూన్ 9న విడుదలకు సిద్ధంగా వున్నా 'పెళ్ళికి ముందు ప్రేమకథ'
- May 26, 2017
చేతన్ శీను, సునైన హీరో హీరోయిన్లుగా మధు గోపు దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 'పెళ్ళికి ముందు ప్రేమకథ'. డి.ఎస్.కె, అవినాష్ సలండ్ర, సుధాకర్ పట్నం నిర్మాతలు. ప్రేమ్ కుమార్ పాట్ర, మాస్టర్ అవినాష్ సలండ్ సమర్పణలో గణపతి ఎంటర్టైన్మెంట్స్, పట్నం ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రూపొందుతోంది.
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రం జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకత్వ పర్యవేక్షకుడు డి.ఎస్.రావు మాట్లాడుతూ.. 'చెప్పిన కథ నచ్చింది. అయితే సినిమాను తీయగలుగుతామా? అని ఆలోచిస్తున్న సమయంలో సుధాకర్ నన్ను కలిశాడు. అలా నలుగురుగా కలిసి నా దర్శకత్వ పర్యవేక్షణలో కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ, ఛాలెంజింగ్ తీసుకుని చేశాను. రొమాన్స్, ఎంటర్టైన్మెంట్ అన్నీ సమపాళ్లలో ఉండేలా చూసుకుని తీశాము. అవసరాల శ్రీనివాస్ మా చిత్రానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. విడుదల చేసిన ట్రైలర్-ఆడియోకి మంచి స్పందన లభించింది. సినిమాకి కూడా అదే స్థాయిలో అలరిస్తుందని ఆశిస్తున్నాం" అన్నారు!
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







