ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ కోసం సిద్ధమవుతున్న అల్ మక్తౌమ్ ఎయిర్పోర్ట్
- October 08, 2015
సౌత్ దుబాయ్‌లోని అల్ మక్తౌమ్ ఇంటర్నేషనల్ టెర్మినల్ అక్టోబర్ 2013లో ప్రారంభమైనప్పటికీ, కేవలం నాలుగు ఎయిర్‌లైన్స్ సంస్థలు మాత్రమే ఈ విమానాశ్రయం నుంచి సేవలు అందిస్తున్నాయి. దుబాయ్‌లో ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థ తన కార్యకలాపాలను మక్తౌమ్ నుంచి నిర్వహించేందుకోసం సన్నద్ధమవుతోంది. 2015 వేసవి నుంచే కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉన్నా, కొన్ని సాంకేతిక సమస్యలతో వాయిదా పడింది. 2016 మొదటి క్వార్టర్లోగానీ ఎమిరేట్స్ కార్యకలాపాలు మక్తౌమ్ నుంచి ప్రారంభమయ్యేందుకు అవకాశాలు కన్పించడంలేదు. ప్రయాణీకుల సౌకర్యార్ధం మరిన్ని విమానాల్ని సమకూర్చుకోవడానికి ఎమిరేట్స్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. తరలింపు విషయంలో ప్రయాణీకుల సౌకర్యమే తమకు ముఖ్యమని ఎమిరేట్స్ అధికారులు వెల్లడించారు. అన్ని అంశాల్ని పరిగణనలోకి తీసుకుని వీలైనంత త్వరగా తరలిస్తామన్నారు. మక్తౌమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 100 ఎయిర్‌లైన్స్ వరకూ కార్యకలాపాల్ని నిర్వహించే అవకాశముంది. దీనికోసం 2016 డెడ్‌లైన్‌గా భావిస్తున్నారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







