1,500 కిలోలతో గిన్నిస్ కేక్..
- May 26, 2017
మైసూరులోని దత్తపీఠం గణపతి సచ్చిదానంద స్వామీజీ 75వ జన్మదినం సందర్భంగా ఆశ్రమంలో జరిగిన వజ్రోత్సవ వేడుకల్లో గురువారం తెనాలికి చెందిన శశి ఆహార్ గ్రూపు సంస్థలు ప్రత్యేకంగా తయారు చేసిన 1,500 కిలోల కేక్‌ను స్వామీజీ కట్ చేసి, భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టారు. 120 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పుతో 1,500 కిలోల బరువుతో రూపొందించిన ఈ కేక్‌పై ఎస్జీఎస్ అనే మూడు అక్షరాలను 8 అడుగల ఎత్తు, 4 అడుగుల వెడల్పుతో చేశారు.
రెండు నెమళ్ల బొమ్మలను కేక్‌కు ఇరువైపులా తీర్చిదిద్దారు. 108 పాదాలు, 108 దీపాలను ఏర్పాటు చేశారు. ఇది పూర్తిగా వెజిటబుల్ పదార్థాలతోనే తయారు చేసినట్టు శశి ఆహార్ అధినేతలు ఉప్పల వరదరాజులు, అనిల్‌కుమార్ శుక్రవారం సాయంత్రం శశి డెలీషియస్లో విలేకరులకు వెల్లడించారు. గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు వచ్చి కేక్‌ను చూసి రికార్డు నమోదు చేసుకున్నారని వరదరాజులు వివరించారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







