రుద్రమదేవి సినిమా చూడబోతున్న కేసీఆర్
- October 08, 2015
తెలంగాణ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర రావు తన కుటుంబ సభ్యులతో కలిసి 'రుద్రమదేవి' సినిమా చూడబోతున్నారు. ఈ మేరకు దర్శకుడు, నిర్మాత గుణశేఖర్ వారి కోసం ఆదివారం ప్రత్యేకంగా షో ఏర్పాటు చేస్తున్నారు. రుద్రమదేవి (3డ్ ) (ఉ /ఆ ): మీ టికెట్స్ ను వెంటనే బుక్ చేసుకోండి! కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన రుద్రమదేవి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇస్తూ c నిర్ణయం తీసుకున్నారు. చిత్ర దర్శకుడు గుణశేఖర్, ఆయన భార్య, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తదితరులు గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన సంగతి తెలిసిందే. మనకు చారిత్రక చిత్రాలు చాలా అరుదనే చెప్పాలి. అప్పుడప్పుడు వచ్చినా అవి భక్తిరక ప్రధానంగా ఉండి, అసలు చరిత్రను మరుగుపరిచేలా తయారవుతున్నాయి. ఇలాంటి పరిస్ధితుల్లో మన తెలుగు జాతి గొప్పతనాన్ని,మన వారసత్వాన్ని గుర్తు చేస్తూ వస్తున్న చిత్రం 'రుద్రమదేవి' . చిన్నప్పటినుంచీ పాఠాల్లో చదువుకున్న ఈ చరిత్ర ఇప్పుడు కళ్ల ముందు ఉంచారు గుణశేఖర్. ఈ చిత్రంలో రుద్రమదేవిగా అనుష్క, గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ హైలెట్. చాళుక్య వీరభద్రునిగా రానా,గణపతిదేవునిగా కృష్ణంరాజు, శివదేవయ్యగా ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా సుమన్, మురారిదేవునిగా ఆదిత్యమీనన్, నాగదేవునిగా బాబా సెహగల్, కన్నాంబికగా నటాలియాకౌర్, ముమ్మడమ్మగా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా హంసానందిని, అంబదేవునిగా జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా అదితి చంగప్ప, టిట్టిబిగా వేణుమాధవ్, ప్రసాదాదిత్యగా అజయ్ నటించారు. ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







