2016 కొత్త కార్మిక చట్టం-యూ.ఏ.ఈ
- October 08, 2015
కార్మిక చట్టంలో కొత్త మార్పుల్ని తీసుకు వస్తున్నారు. 2016 నుంచి అమల్లోకి వచ్చే ఈ కొత్త చట్టంలో మూడు ముఖ్యమైన నిబంధనల్ని పొందుపర్చారు. కార్మిక మంత్రిత్వ శాఖ ఈ వివరాల్ని వెల్లడించింది.
కార్మికుల కోసం లేబర్ కాంట్రాక్ట్, ఉద్యోగులు మరియు కార్మికుల మధ్య ఒప్పందాల రద్దు, రెసిడెంట్ వర్కర్ కోసం కొత్త వర్క్ పర్మిట్ వంటివి ఇందులో పొందుపర్చారు. కార్మిక శాఖ మంత్రి సక్ర్ ఘోబాష్ సయీద్ ఘోబాష్ చెబుతూ ఈ మార్పులు కార్మికుడికి యజమానికి మధ్య సంబందాల్ని మెరుగుపర్చుతాయన్నారు. యజమానికీ, విదేశీ కార్మికుడికీ మధ్య స్పష్టమైన మరియు వివరణాత్మకమైన ఒప్పందానికి సంబంధించి మొదటి నిబంధనను చేర్చినట్లు తెలియవస్తుంది. రెండో నిబంధన ప్రకారం రెండేళ్ళ ఒప్పందం చేసుకునేటప్పుడు కార్మికుడ్ని ముందే తొలగించాలనుకుంటే నెల రోజుల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. గడువు లోపు చెల్లింపులన్నీ కార్మికుడికి జరగాలి. మూడో నిబంధన, ఆరు నెలలు పనిచేసిన తర్వాత మాత్రమే యజమాని, కార్మికుడిని తొలగించడానికి వీలవుతుంది.
--శాలెం బాబు (అడ్వకేట్,దుబాయ్)
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







