సారధి స్టూడియో లో శత్రు సినిమా ప్రారంభం

- May 27, 2017 , by Maagulf
సారధి స్టూడియో లో శత్రు సినిమా ప్రారంభం

శ్రీ కుసుమ హర క్రియేషన్స్ పతాకంపై హరినాథ్ రెడ్డి, తపస్,తమన్నా వ్యాస్, శ్రేయ వ్యాస్, సురేష్ వర్మ ప్రధాన పాత్రల్లో సుదర్శన్ రెడ్డి దర్శకత్వం లో టి. హరినాథ్ రెడ్డి నిర్మిస్తున్న రివేంజ్ థ్రిల్లర్ మూవీ శత్రు. ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్  సారధి స్టూడియో లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి బేబీ కుసుమ క్లాప్ నివ్వగా, మిస్సెస్ స్వప్న కెమెరా స్విచ్ ఆన్ చేశారు. జూన్ లో షూటింగ్ స్టార్ట్ చేసి సెప్టెంబర్ నెలలో ఈ చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమం లో హీరో హరినాథ్ రెడ్డి, మరో హీరో తపస్, హీరోయిన్ తమన్నా వ్యాస్, శ్రేయ వ్యాస్, సంగీత దర్శకుడు ఉదయ్ ముద్గల్, డిఓపి: వై వి నవీన్ తదితరులు పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com