హైదరాబాద్‌లో మరో సిగ్నేచర్ టవర్స్
- May 27, 2017
హైదరాబాద్‌లో మరో ఐటీ టవర్ రానుంది. సిగ్నేచర్ టవర్స్ ను నిర్మించేందుకు ఐటీ సర్వ్ సంస్థ ముందుకొచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్.. శాంటాక్లారాలో ఐటీ, డాటా, గేమింగ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పెట్టుబడులు, వ్యాపార విస్తరణకు తెలంగాణలో ఉన్న అవకాశాల గురించి వారికి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలను వివరించారు. ఈ సందర్భంగా ఐటీ సర్వ్ అలయన్స్ సంస్థ.. హైదరాబాద్‌లో టవర్ నిర్మాణానికి ముందుకొచ్చింది. ఆ సంస్థ ప్రతినిధుల విజ్ఞప్తికి మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు.
మరోవైపు డెల్ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ అయిన వీఎం వేర్ ప్రతినిధులతోనూ మంత్రి భేటీ అయ్యారు. ప్రభుత్వ పథకాల అమలు, మూల్యాంకనంలో డాటా అనలిటిక్స్‌ను తెలంగాణ ప్రభుత్వం వినియోగిస్తున్న తీరును వివరించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న డాటా అనలిస్టిక్ పార్క్‌లో ప్రధాన పెట్టుబడిదారుగా ఉండాలని, రాష్ట్రానికి ప్రతినిధుల బృందాన్ని పంపాలని వీఎం వేర్ సంస్థ ప్రతినిధులను కేటీఆర్ కోరారు. అలాగే ఎలక్ర్టానిక్స్ ఆర్ట్స్ కంపెనీ ప్రతినిధులతోనూ చర్చలు జరిపారు. ఎంటర్‌టైన్‌మెంట్, గేమింగ్ రంగాల్లో హైదరాబాద్‌లో విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. హాలీవుడ్ సినిమాలకు కూడా హైదరాబాద్‌లో యానిమేషన్ వర్క్ జరుగుతోందని వివరించారు. తెలంగాణ పారిశ్రామిక విధానంలో గేమింగ్ కోసం ప్రత్యేక పాలసీ ఉందన్నారు. హైదరాబాద్‌లో గేమ్ సిటీని ఏర్పాటుచేసే ఆలోచనలో తమ ప్రభుత్వం ఉందని కేటీఆర్ వివరించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







