అమెరికా పోర్ట్‌లాండ్ లో ముస్లిం మహిళలపై దాడి
- May 27, 2017
- అడ్డొచ్చిన ఇద్దర్ని చంపేసిన దుండగుడు
ఒక జాతి అంతటినీ శత్రువులా భావిం చిన ఓ అమెరికన్ విచక్షణ కోల్పోయి దాడికి తెగబడ్డాడు. అన్యాయంగా ఇద్దర్ని పొట్టనబెట్టుకున్నాడు. ఈజిప్టులో క్రైస్తవుల్ని చంపిన ఘటనకు ప్రతీకారంగా...అమెరికాలోని ముస్లిం మహిళలపైకి దాడికి దిగాడు. తీవ్రమైన పదజాలం తో దూషించాడు. ఒరేగాన్ రాష్ట్రంలోని ప్రముఖ నగరం పోర్ట్‌లాండ్‌లో శుక్రవారం నాడు ఈ ఘటన చోటు చేసు కుంది. సిటీ ఆఫ్ పోర్ట్‌ల్యాండ్ పోలీసులు తెలిపిన కథనం ఇలా ఉంది..
లోకల్ ట్రైన్‌లో దుండగుడు తీవ్రమైన ఉద్వేగంతో ఇష్ట మొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఏదో ఏదో సంబంధంలేని అంశాలతో ముడిపెడుతూ కొంతమందిని దూషిస్తున్నాడు. ముస్లింలా కనపడుతున్న ఇద్దరు మహిళల్ని లక్ష్యంగా ఎంచుకొని దాడికి దిగాడు. 'ముస్లింలను చంపాలి' అంటూ వారిపైకి వెళ్తున్న తరుణంలో పక్కనున్న కొంతమంది కలుగజేసుకొని దుండగుడ్ని ఆపే ప్రయత్నం చేశారు. కానీ దుండగుడు మరింత రెచ్చిపోయి అడ్డువచ్చిన వారిపై పిచ్చివాడిలాగా కత్తితో దాడిచేశాడు. దీంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే చనిపోగా, తీవ్రగాయాలపాలైన ఇద్దరిలో ఒకరు హాస్పిటల్‌లో మరణించాడు. దాడి ఘటన తెలుసుకున్న పోలీసులు దుండగుడు రైల్లో ఉండగానే పట్టుకున్నారు. దాడి ఘటనను 'ద కౌన్సిల్ ఆన్ అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్' తీవ్రంగా ఖండించింది.
ముస్లింలకు వ్యతిరేకంగా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడటం వల్లే అమెరికన్లలో ఇస్లామోఫోబియా పెరిగిందని, అందువల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నా యని కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు జాతి వివక్షతకు మరింత ఊతమిస్తున్నదని కౌన్సిల్ ఆరోపించింది.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్‌కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









