మహానాడు లో సినీ నటి కవిత కు 'చేదు అనుభవం'

- May 28, 2017 , by Maagulf
మహానాడు లో సినీ నటి కవిత కు 'చేదు అనుభవం'

 తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కవిత మహానాడు వేదిక ముందు కన్నీటి పర్యంతమయ్యారు..అధికారం లోకి రానప్పుడు తనకు ఎంతో గౌరవం ఇచ్చారని , పార్టీ కి సంబదించిన ఏ చిన్న మీటింగ్ జరిగిన తనకు ఆహ్వానం అందించేవారని , ఇప్పుడు అధికారం లోకి వచ్చాక పూర్తి గా నన్ను పక్కన పెట్టారని వాపోయింది.
''తెలుగుదేశం పార్టీలో మహిళలకు కనీస గౌరవం లేదు.. సినిమా వాళ్లంటే మరీ చిన్నచూపు.. గడిచిన మూడేళ్లుగా ఎన్నో అవమానాలకు గురిచేశారు.. చేస్తున్నారు.. చాలా క్షోభపెట్టారు. ఇలాంటి పార్టీలో ఎందుకు కొనసాగాలో మీరే చెప్పండి'' అని కవిత కన్నీరు పెట్టుకుంది..పార్టీ అధికారం లోకి రావడం కోసం రేయి పగలు కష్టపడ్డానని , కుటుంబాన్ని సహా పక్కన పెట్టానని చెప్పుకొచ్చింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com