జూన్ 30న రిలీజ్ కాబోతున్న 'కథలో రాజకుమారి'
- May 28, 2017
డిఫరెంట్ మూవీస్‌తో ఆకట్టుకుంటున్న నారా రోహిత్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా కథలో రాజకుమారి. మహేష్ సూరపనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అరకు ప్రాంతంలో వేసిన భారీ సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.. మేస్ట్రొ ఇళయరాజా రెండు పాటలకు సంగీతమందించగా.. 'కృష్ణగాడి వీరప్రేమగాధ' ఫేం విశాల్ చంద్రశేఖర్ మరో ఐదు పాటలకు మ్యూజిక్ చేశాడు. త్వరలో ఈ సినిమా ఆడియోను అరన్ మ్యూజిక్ ద్వారా మర్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.
ఇంత వరకు చేయని డిఫరెంట్ క్యారెక్టర్లో నారా రోహిత్ నటిస్తుండగా మరో యంగ్ హీరో నాగశౌర్య ప్రత్యేక పాత్రలో అలరించనున్నాడు. వీరి ఇద్దరి మధ్య జరిగే సన్నివేశాలు సినిమాకే హైలెట్ అంటున్నారు చిత్రయూనిట్. నమిత ప్రమోద్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో కోటా శ్రీనివాసరావు, పరుచూరి వెంకటేశ్వర రావు, అవసరాల శ్రీనివాస్, మురళీమొహన్, అజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, హీరోయిన్ నందిత ఒక కీలక పాత్రలో కనిపించనుంది.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ 30న సినిమాలను రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఆరోహి సినిమా, అరన్ మీడియ వర్క్స్, శ్రీహాస్ ఎంటెర్టైన్మెంట్స్, సుధాకర్ ఇంపెక్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్‌కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









