ఓపెనింగ్ రోజే మొదటి లుక్..

- May 28, 2017 , by Maagulf
ఓపెనింగ్ రోజే మొదటి లుక్..

ఖైదీ నెం 150 తో మెగా హిట్ అందుకున్న చిరంజీవి , ప్రస్తుతం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మూవీ ఫై ఫుల్ ఫోకస్ పెట్టాడు..జూన్ లోనే ఈ మూవీ ఓపెనింగ్ జరుగుతుందని అనుకున్నప్పటికీ , ఇంకా కథ , కథనాలు , నటి నటుల ఎంపిక వంటివి జరుగుతుండడం తో సెట్స్ ఫై కి రావడానికి ఇంకాస్త లెట్ అయ్యే అవకాశం ఉంది.

దీంతో సినిమా ఓపెనింగ్ రోజే చిరంజీవి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తున్నారు. ఈ సినిమా గెటప్ కు సంబంధించి చిరంజీవి ఇప్పటికే మేకోవర్ ప్రారంభించారు. మరోవైపు గెటప్ కోసం కొన్ని స్కెచ్ లు రెడీచేశారు. చిరంజీవి కొత్త గెటప్ తో మొదటి దశ ఫొటో షూట్ కూడా పూర్తి చేసారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 22న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రాజెక్టు లాంచ్ అవుతుంది.

ఆరోజే ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేస్తారట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com