రమదాన్‌కి 300 డ్రోన్స్‌తో స్వాగతం

- May 29, 2017 , by Maagulf
రమదాన్‌కి 300 డ్రోన్స్‌తో స్వాగతం

జెడ్డా: జనరల్‌ అథారిటీ ఫర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (జిఇఎ), పవిత్ర రమదాన్‌ మాసానికి కొత్త తరహాలో స్వాగతం పలికింది. 300 డ్రోన్లకు అమర్చిన లైట్స్‌ ద్వారా స్వాగతం పలకడం సరికొత్త అనుభూతి. ఆకాశంలో డ్రోన్లు ఎగురుతూ లైట్లు దర్శనమివ్వడంతో వీక్షకులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. అరబిక్‌లో రమదాన్‌ శుభాకాంక్షల్ని పేర్కొంటూ డ్రోన్లను ఆకాశంలోకి పంపించారు. రంగు రంగుల లైట్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెనా రీజియన్‌లో ఇంతవరకు ఈ తరహా ప్రయత్నం ఎవరూ చేయలేదని నిర్వాహకులు తెలిపారు. కొత్తదనంతో కూడిన ఆలోచన చేసి కొత్తగా రమదాన్‌ శుభాకాంక్షలు తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ముందస్తుగానే తెలుసుకున్నప్పటికీ, ఈ స్థాయిలో కొత్తదనం ప్రదర్శిస్తారని అనుకోలదంటూ పలువురు సందర్శకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ అథారిటీ పవిత్ర రమదాన్‌ మాసంలో ఇలాంటి కార్యక్రమాలు మరిన్నింటిని చేపట్టనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com